తెలంగాణ

పంచాయతీ ఎన్నికలంటే పరేషానీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 18: ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికల్లో ప్రలోభాల పర్వాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సరికొత్త నిబంధనలను అమలు చేస్తూ, అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ డబ్బు, మద్యం పంపకాలదే పై చేయిగా నిలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లను ఎరగా వేయడం సంప్రదాయంగా మారి అంతకంతకూ ప్రలోభాల పర్వం జోరందుకోవడం స్థానిక సంస్థల ఎన్నికల పైనా ప్రభావం కనబరుస్తోంది. చివరకు పార్టీలకతీతంగా కేవలం రైతులు మాత్రమే సభ్యులుగా ఉండే సహకార సంఘాల ఎన్నికల్లోనూ ప్రలోభాల పర్వం శృతిమించడం ఆందోళన కలిగించే అంశంగా మారిందనే చెప్పాలి. వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగించే అవకాశాలుండగా, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న అనేక మంది ఆశావహులు ఇప్పుడు తటపటాయింపునకు లోనవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్కో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు చేతులు మారగా, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, బల్దియాల ఎన్నికల్లోనూ వాటి స్థాయికి అనుగుణంగానే ప్రలోభాల పర్వం కొనసాగడం ఖాయమని స్పష్టమవుతోంది. పంచాయతీ ఎన్నికల బరిలో తలపడాలని భావిస్తున్న పలువురు ఆశావహులు ఇప్పటినుండే లెక్కలు బేరీజు వేసుకుంటున్నారు.
అయితే సదరు అభ్యర్థులంతా ఎన్నికల ఖర్చును సొంతంగా భరించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఆర్థికంగా పలుకుబడి కలిగిన వారే ఎన్నికల గోదాలో దిగే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరిగిపోవడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటును అందించే ప్రధాన నాయకులు కరువయ్యారనే చెప్పాలి. అదే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిగి ఉంటే, ఎమ్మెల్యేగా బరిలోకి దిగే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమతమ అనుయాయులు, మద్దతుదారులను పంచాయతీ సమరంలో పోటీ చేయించి వారికి అన్ని విధాలుగా మద్దతుగా నిలిచేందుకు ఆస్కారం ఉండేది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దరిమిలా, గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన ప్రధాన పార్టీల నాయకులు కూడా పంచాయతీ ఎన్నికల్లో తమ అనుయాయుల పక్షాన డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. ఒకవేళ ఆధిపత్యం చాటుకోవాలని భావించినా, ప్రజల్లో పలుకుబడి కలిగి ఉన్న అనుచరులను బరిలోకి దించుతూ ముందుగా గెలిచి రావాలని, తరువాత తాము అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని పేర్కొంటున్నట్టు తెలిసింది. దీంతో పంచాయతీ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న ఆశావహులు ఎన్నికల ఖర్చును లెక్కలు వేసుకుని గుండెలు చిక్కబట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాయిలాలు అందుకున్న ఓటర్లు, ప్రస్తుతం పంచాయతీ పోరులోనూ ఎంతోకొంత ఆశించడం ఖాయమని, అలాంటప్పుడు వారిని సంతృప్తిపర్చే స్థోమత లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే ఓటమిని చవిచూడాల్సి వస్తుందని జంకుతున్నారు. వాస్తవంగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్లలో ఓటర్లకు 500రూపాయలు మొదలుకుని 2వేల రూపాయల వరకు కూడా డబ్బులను అందించారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. పచ్చనోట్ల పంపిణీకి తోడు మద్యంను ఏరులై పారించారు. ఎక్కడ చూసినా విందు, వినోదాలకు కొదవ లేకుండాపోయింది.