తెలంగాణ

ప్రకాశ్‌రాజ్ ‘దోసిట చినుకులు’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: సినీనటుడు ప్రకాశ్ రాజ్ తాను రాసిన దోసిట చినుకులు పుస్తకాన్ని సోమవారం నాడు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తకమహోత్సవ కార్యక్రమంలో ఆవిష్కరించారు. సమాజంలో తన కళ్ల ముందుకు కనిపిస్తున్న అంశాలను, ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ పుస్తకం రాసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షత వహించగా, పుస్తకాన్ని ఓలేటి పార్వతీశం పరిచయం చేశారు. కవి, రచయిత సీతారామ్ పుస్తకాన్ని విశే్లషించారు. మిసిమి మాసపత్రిక సంపాదకుడు వల్లభనేని అశ్వినీ కుమార్ స్వాగతం పలికారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చేయాల్సింది చాలా కనిపిస్తోందని, ప్రతి ఒక్కరిపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్‌లో మహానటుడే కాదని, గొప్ప దార్శనీకుడు ఉన్నాడని పేర్కొన్నారు. ఏదైనా నిజం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని, అలాంటి ధైర్యం ప్రకాశ్‌రాజ్‌లో దండిగా ఉందని అన్నారు. అతని రచనల్లో, ఉపన్యాసాల్లో ఆ ధైర్యం కనిపిస్తోందని పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్తగా, ఆయన సేవలు కొనియాడదగినవని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంరంభంలో ఆయన గళం విప్పారని అన్నారు. కేసీఆర్ తెలంగాణాకే కాదని, దేశానికి అవసరమని ప్రకాశ్‌రాజ్ చెప్పారని ఎన్నికల సందర్భంగా ఎన్ని పెప్పర్ స్ప్రేల సర్వేలు జరిగినా, ప్రకాశ్‌రాజ్ మాత్రం కేసీఆర్ రావాలని, కేసీఆర్ గెలిచితీరుతారని చెప్పారని అన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు విప్పక ముందే ప్రకాశ్‌రాజ్ కేసీఆర్ ఘనవిజయాన్ని చెప్పడం ఆయన దార్శనీకతకు నిదర్శనమని అన్నారు. సమాజంలో మార్పు కావాలని కోరుకునే సాహితీవేత్త ప్రకాశ్ రాజ్ అని గౌరీశంకర్ కొనియాడారు.
చిత్రం..జూలూరు గౌరీశంకర్‌ను సన్మానిస్తున్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్