తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లాలో 218 సర్పంచ్‌లు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 14: రాజకీయ పార్టీల కోలాహలంతో పచ్చనిపల్లెల్లో ఎన్నికల చిచ్చు రేగుతుండగా ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం రాజకీయాల జోక్యం లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు స్థానాలను ఎన్నుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 500 జనాభా కలిగిన గూడేలు, తాండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఆ పల్లెల్లో సైతం తొలి ఎన్నికలకు ప్రాధాన్యతనివ్వకుండా గ్రామస్తులు ఏకమై ఏకగ్రీవాల వైపు అడుగులు వేస్తుండడం గమనార్హం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 1503 గ్రామపంచాయతీలు ఉండగా మొదటి, రెండు విడతల ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో ఈ రెండు విడతల్లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 218 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 467 గ్రామపంచాయతీలు ఉండగా ఈనెల 21న, రెండో విడత 25న జరిగే ఎన్నికల సంధర్భంగా జనరల్, బీసీ స్థానాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతగా జరిగే ఎన్నికల్లో 50 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా రెండో విడతలో 58 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గమనార్హం. నిర్మల్ జిల్లాలో తొలి విడతకు 58 ఏకగ్రీవం కాగా రెండో విడతలో 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కుమురంభీం జిల్లాలో తొలి విడత 9, రెండో విడతలో 11, మంచిర్యాల జిల్లాలో తొలి విడత 8, రెండో విడతలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పలుచోట్ల రెండేసి నామినేషన్లు దాఖలు కాగా గ్రామస్తులే ముందుకు వచ్చి నచ్చజెబుతూ నామినేషన్లను ఉపసంహరింపజేయడంతో ఏకగ్రీవాలకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల నజరానా ప్రకటించడం వల్లే ఈ నిధులతో సమష్టిగా గ్రామాలను అభివృద్ది చేసుకోవాలన్న తలంపుతో ఏకగ్రీవాలకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.