తెలంగాణ

జంతువులపై ప్రయోగాలకు మంగళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: మనుష్యుల ఆరోగ్య రక్షణకు మందులను రూపొందించే క్రమంలో కోతులు, శునకాలు, ఇతర జంతువులపై ప్రయోగాలు చేయడం నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఐసీఎంఆర్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. జీవవైద్య రంగంలో ఎదురవుతున్న ప్రమాదాల అంచనాకు మానవీయ మార్గం అనే్వషించడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అండ్ పీపుల్ ఫర్ ఏనిమల్ సంస్థ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగా ఐసీఎంఆర్ ఈ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా హెచ్‌ఎస్‌ఐ డిప్యుటీ డైరెక్టర్ అలోక్‌పర్ణ సేన్‌గుప్త మాట్లాడుతూ ఐసీఎంఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైద్య ఉత్పత్తుల పరీక్షల నిమిత్తం జంతువులపై ప్రయోగాలు చేయడం నిలిపివేయాలని హెచ్‌ఎస్‌ఐ చేసిన విజ్ఞప్తిని పరిగణించిన ఐసీఎంఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆయన వివరించారు.