తెలంగాణ

కొత్తవారు 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ శాసనసభకు సభ్యులుగా ఎన్నికైన వారిలో కొత్తగా మొట్టమొదటి సారి ఎన్నికైన వారు 25 మంది ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు 16 మంది ఉన్నారు. తెలంగాణ తొలి శాసనసభలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన 76 మంది మళ్లీ రెండో శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తున్న బాల్కసుమన్, సిహెచ్. మల్లారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పదవీ ప్రమాణం చేశారు. ప్రస్తుత శాసనసభకు ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ సభ్యుడు. ఆయన ఎనిమిదో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీనియర్ శాసనసభ్యులని రిక్డాలు చెబుతున్నాయి. వయస్సు రీత్యా పరిశీలిస్తే కాంగ్రెస్ నుండి కొత్తగూడెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వనమా వెంకటేశ్వరరావు 73 సంవత్సరాలతో అందరికంటే వయస్సులో పెద్దవారు. అలాగే ఇల్లందు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన భానోతు హరిప్రియ (29) అందరికంటే వయస్సులో చిన్నవారు. పార్టీల వారీగా పరిశీలిస్తే టీఆర్‌ఎస్ నుండి ఎన్నికైన వారు 88 మంది కాగా, కాంగ్రెస్ నుండి 19 మంది ఎన్నికయ్యారు. ఎంఐఎం నుండి ఏడుగురు, టీడీపీ నుండి ఇద్దరు, బీజేపీ నుండి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు ఎన్నికయ్యారు. ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధిగా స్టీఫెన్‌సన్ రెండోసారి నియామకం అయ్యారు. తెలంగాణ తొలి శాసనసభకు కూడా స్టీఫెన్‌సన్ నియామకం అయ్యారు.