తెలంగాణ

లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర బలగాలు: ఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర బలగాలను పంపించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఇవో) రజత్ కుమార్ తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సీఇవో రజత్ కుమార్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో, రాష్ట్ర డీజీపీ వీ. మహేందర్ రెడ్డితో సమావేశమై చర్చించారు. ఈ నెల 22న కేంద్ర ఎన్నికల సంఘం (సీఇసీ) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి ఈ లోగా సమగ్ర సమాచారంతో ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటరు జాబితా నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇచ్చిందని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల దగ్గర బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు కాబట్టి ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.