తెలంగాణ

మూడోదశలో 1,19,624 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: పంచాయతీ ఎన్నికల మూడోదశలో సర్పంచ్‌స్థానాలు, వార్డుసభ్యుల స్థానాలకు మొత్తం 1,19,624 నామినేషన్లు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడో దశలో 4116 గ్రామ పంచాయతీలకు రిటర్నింగ్ అధికారులు నోటీస్ ఇవ్వగా, సర్పంచ్ స్థానాలకు 26,106 నామినేషన్లు వచ్చాయి. 36,729 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటీసు ఇవ్వగా 93,518 నామినేషన్లు వచ్చాయి. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది. అదే రోజు రంగంలో ఉండే అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఈ నెల 30 న మూడో దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్ తెలిపారు.