తెలంగాణ

విదేశీ భాషలకు భారత్‌లో గిరాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: భాషలు నేర్చుకుని ఎందుకూ కొరగాలేదని బాధపడే రోజులు పోయాయి. విదేశీ భాషలు నేర్చుకున్న వారికి దేశంలో అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఉపాధి కల్పించే కోర్సుల్లో విదేశీ భాషల అధ్యయనం కూడా చేరింది. అవకాశాలు పెంచుకునేందుకు యువత నేడు విదేశీ భాషల అధ్యయనంపై మక్కువ చూపుతున్నారు. రాయబార కార్యాలయాల్లో అనువాదకులుగానూ, ఐటీ కంపెనీల్లోనూ, న్యాయసలహా సంస్థల్లో , పార్లమెంటులోనూ, వివిధ యూనివర్శిటీల్లో భాషలపై అధ్యయనం చేసిన వారికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇటీవల ఒక సర్వేలో దేశంలో భాషాధ్యయనం చేసిన 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని తేలింది. చైనీస్ భాష నేర్చుకున్న వారికి 11 లక్షల రూపాయిల వరకూ వేతనం పొందే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే చైనీస్ భాషను నేర్చుకున్న వారి డిమాండ్ 80 శాతం పెరిగింది. ఆంగ్ల భాష నేర్చుకున్న వారికి కూడా అవకాశాలు పెరిగాయి. ప్రధానంగా యురోపియన్ భాషలు నేర్చుకున్న వారికి హాట్‌కేక్‌లా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆంగ్లభాషా ప్రావీణులు తక్షణం 25,570 మంది అవసరమని యాడ్జున సంస్థ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వారి వేతనాలు కూడా 11 శాతం అదనంగా పెరిగాయని పేర్కొంది. ఫ్రెంచి, స్పానిష్, జర్మన్ భాషలు నేర్చుకున్న వారికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. ఫ్రెంచి నేర్చుకున్న వారికి నెలకు 9.83 లక్షల రూపాయిల వరకూ వేతనం దక్కుతోంది. అలాగే ప్రాంతీయ భాషల విషయానికి వస్తే పంజాబీ వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా దక్కుతున్నాయి. ఏదైనా వృత్తి, సాంకేతిక విద్యా కోర్సును పూర్తి చేసిన వారికి అదనంగా పంజాబీ భాష వస్తే వారికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. అరబిక్ , బెంగాలి, చైనీస్, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, జపానీస్, పంజాబీ, స్పానిష్ భాషలు నేర్చుకున్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ విదేశీ భాషలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీలు అరబిక్, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. విదేశీ భాషలు నేర్చుకున్న వారు చాలా వరకూ దుబాసీలుగా పనిచేసేందుకు అవకాశాలున్నాయని , విదేశీ భాషలు నేర్చుకున్న వారు తమ ప్రత్యేక స్పెషాలిటీ సబ్జెక్టులో కూడా రాణించడానికి ఈ భాషలు తోడ్పడతాయని పేర్కొన్నారు.