తెలంగాణ

పాత కేసులకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: సీబీఐ అధికారాల పరిధిపై కేంద్ర ప్రభుత్వం మరో మారు స్పష్టత ఇచ్చింది. రాష్ట్రాల్లో కొనసాగుతున్న కేసులకు సంబంధించి ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని, సీబీఐ ఆ కేసుల దర్యాప్తును కొనసాగించే అధికారం ఉందని పేర్కొంది. పాత కేసులకు సంబంధించి రాష్ట్రాల అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసు చట్టంలో కేంద్రం చేసిన కీలక సవరణలను ప్రస్తావిస్తూ సీబీఐకి కేసుల దర్యాప్తు విషయంలో అటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ సంపూర్ణ అధికారాలు ఉన్నాయని పేర్కొంది. డిల్లీ పోలీసు చట్టం (డిఎస్‌పీఈ) 1946లోని సెక్షన్ 2(1) కింద కేంద్రప్రభుత్వం ఏ కేసు దర్యాప్తునకైనా ప్రత్యేక పోలీసు విభాగాన్నా ఏర్పాటు చేసే అధికారం కలిగి ఉందని, సెక్షన్ -3 కింద పొందుపరిచిన నేరాలకు మాత్రమే పరిమితం కాకుండా సెక్షన్ -5లోని అంశాలను కూడా దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంటుంది. న్యాయస్థానాలు ఏదైనా కేసును సీబీఐకి అప్పగించిన పక్షంలో వాటి దర్యాప్తును అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదని, సీబీఐ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆ కేసుల దర్యాప్తును కొనసాగించవచ్చని కూడా కేంద్రం స్పష్టం చేసింది.