తెలంగాణ

రైతుబంధు శాశ్వతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రైతుబంధు పథకం తాత్కాలికం కాదని, శాశ్వతమని వ్యవసాయశాఖ కమీషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. ఈ పథకం తాత్కాలికమని తాను వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఖండించారు. రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తున్నారన్నారు. రైతుబంధు పథకం దేశానికి మార్గదర్శకంగా మారడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సమాయత్తం అవుతున్నాయన్నారు. రైతుబంధుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఈర్షతో కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్థసారథి ఖండించారు.