తెలంగాణ

ఎంబీసీలకూ జాతీయ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: దేశంలో బీసీ లకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేసిన రీతిలోనే ఎంబీసీలకు సైతం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడతానని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జాతీయ ఎంబీఏ సంక్షేమ సంగమంలో మాట్లాడినట్టు చెప్పిన దత్తాత్రేయ దేశంలో స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా బీసీల స్థితి గతులు మారలేదని పేర్కొన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతుల స్థితిగతుల్లో మార్పు జరగలేదని రిజర్వేషన్లలో సైతం ఎంబీసీలకు న్యాయం జరగలేదని అన్నారు. గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే మార్చుకుంటున్నారని, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే బీసీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నా రు. బడుగు వర్గాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలను రూపొందించి బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం జరిగిందని అన్నారు. బీసీల్లో 34 శాతం ఎంబీసీలకు బీజేపీ రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు.