తెలంగాణ

ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 14: ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం నేర్పుతారని, బయ్యారంలో ఉక్కుపరిశ్రమ సాధించేదాకా పట్టువీడని సంకల్పంతో ముందుకు సాగుతామని కాంగ్రెస్‌శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మహబూబాబాద్‌జిల్లా బయ్యారం మండలకేంద్రంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ చేపట్టిన 36గంటల దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు అంశాన్ని స్పష్టంగా చేర్చడం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్టస్రమితి సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ నాలుగున్నర సంవత్సరాల కాలాన్ని వృధా చేశాయని విమర్శించారు. సర్వేల పేరుతో ప్రజలను మోసగించాలని చూస్తే ఉద్యమాలతో తిప్పికొడుతామని హెచ్చరించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన ముడిసరుకుతో నీటి లభ్యత, రవాణాపరమైన సౌకర్యాలు ఇతర అన్ని హంగులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ రకరకాల సర్వేల పేరుతో ఉక్కుపరిశ్రమ ఏర్పాటును నీరుగార్డెవిధంగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను జాతీయస్థాయిలో చాటిచెప్పే విధంగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఒక సాహసోపేతమైన కార్యక్రమానికి పూనుకున్నారని, రాజకీయాలకు అతీతంగా ఉక్కుపరిశ్రమను కోరుకునే ప్రతి ఒక్కరు హరిప్రియకు మద్ధతుగా తరలివచ్చారన్నారు. కలసి వచ్చే పార్టీలను, సంఘాలను అన్నింటిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కుపరిశ్రమ సాధన కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని భట్టివిక్రమార్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింగరేణి సహకారంతో ఉక్కుపరిశ్రమ స్థాపిస్తామని చెప్పిన రాష్ట్రప్రభుత్వం ప్రజల నుండి ఇంత తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం అవుతున్నా ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలతోపాటు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా వెలసిల్లే బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. 36గంటల దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్‌పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని తీవ్రస్థాయిలో లెవనెత్తుతామని భట్టివిక్రమార్క అన్నారు. అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు నిమ్మరసం అందించి 36గంటల దీక్షను విరమింపజేశారు. కొత్తగూడభద్రాచలం కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రామచంద్రునాయక్, మానుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమామురళీనాయక్, బయ్యా రం మండలపార్టీ అధ్యక్షుడు ముసలయ్య, కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి డివై గిరిలతోపాటు నియోజకవర్గ పరిధిలోని సుమారు 50మంది సర్పంచ్‌లు, కాంగ్రెస్‌పార్టీతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
చిత్రం..హరిప్రియకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న భట్టివిక్రమార్క