తెలంగాణ

ఏనుమాముల మార్కెట్లో పెరిగిన పంట కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 15: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతుల నుండి నేరుగా ఈ-నామ్ పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే ప్రక్రియను మరింత మెరుగుపరచనున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం మార్కెట్ యార్డు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ యస్ దయానంద్, మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు రాజు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మాట్లాడుతూ ఈ-నామ్ అమ్మకాల ప్రక్రియ గురించి జిల్లాలోని ఒక లక్షా 39వేల రైతులకు అవగాహన కల్పించుటకై గ్రామ స్ధాయిలో వ్యవసాయం, మార్కెటింగ్ అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా ఉన్న వరంగల్ మార్కెట్ ప్రతి రోజు సగటున 10కోట్ల విలువైన పంటల కొనుగోలు జరుగుతుందని తెలిపారు. ఈ మార్కెట్‌లో 528 మంది ట్రేడర్స్, 552 మంది కమీషనర్ ఎజెంట్లు(అడ్తిదారులు), 125 మంది దళవాయిలు, 2700 మంది హమాలీలు, 875 మంది గుమాస్తాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే పంటలకు మంచి ధరలు అందించుటకు 41రైస్ మిల్లులు, 30 కాటన్ జిన్నింగ్ మిల్లులు, 21 కోల్డ్ స్టోరేజిలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైతులు తాము పండించిన పంటలకు దేశంలోని ప్రముఖ మార్కెట్ యార్డు లు, ట్రేడర్లకు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచి మంచి ధరలు లభింపజేయుటకే ఈ-నామ్ మార్కెట్ వ్యవస్ధతో వరంగల్ మార్కెట్‌ను ప్రభుత్వం అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ-నామ్ ద్వారా ఇప్పటివరకు 11వేల మంది రైతులు అనుసంధానమే పంటను విక్రయించినట్లు తెలిపారు. ఈ-నామ్ వ్యవస్ధను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం దృష్టికి తేనున్నట్లు తెలిపారు. అందులో ప్రధానంగా ఆన్‌లైన్ ద్వారా చూసుకొని కొనుగోలు చేసిన ట్రేడర్లకు అదే సరకు డెలివరి అవుతుందనే నమ్మకాన్ని కలిగించాలని తెలిపారు. ప్రస్తు తం ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న ఈ-పేమెంట్ వివరాలు అటు రైతుకు, ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలియపరిచే పద్ధతి అందుబాటులో లేదని తెలిపారు. దాని వలన రైతులకు సొమ్ము చెల్లింపులు జరిగినట్లు ధృవీకరించుకోలేమని అన్నారు. దీనికి పరిష్కారంగా ఈ- నామ్ ట్రేడింగ్‌లో పాల్గోనే ట్రేడర్లు మార్కెట్ యార్డు ప్రత్యేక ఖాతాలో తమ టర్నోవర్‌కు తగిన స్ధాయిలో కొంత సొమ్మును రివాల్వింగ్ ఫండ్ గా జమచేస్తే బాగుంటుందని అన్నారు. దీని ద్వారా రైతుకు వెంటనే చెల్లింపులు జరిగేందుకు అకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఈ-నామ్ పద్ధతిలో రోజువారీగా జరుగుతున్న విక్రయాలు, లభించిన ధరల వివరాలను రైతులకు తెలియజేసేందుకు ఎన్, ఐసీ, ఎస్ ఏంఎస్ వ్యవస్ధను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించుటకు గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటి సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహంచాలని తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, మిర్చి పంటలను కొనుగోలు చేసిన ట్రేడర్లు వాటిని చైనా, మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ తదితరులు పాల్గొన్నారు.