తెలంగాణ

6945 పండిట్ పోస్టుల ఉన్నతీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం 6143 భాషా పండితులు, 802 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నతీకరిస్తూ శనివారం నాడు జీవో 15ను జారీ చేసింది. లోగడ 2017 ఫిబ్రవరి మూడో తేదీన విడుదల చేసిన జీవో నెంబర్ 17,18 ద్వారా ఉన్నతీకరించిన 2487 పండిట్, 1047 వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు ఇవి అదనం. మొత్తంగా 8630 భాషా పండితులు, 1849 పీఈటీలు మొత్తం కలిపి 10479 పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరించినట్టయింది. ఈ నిర్ణయంపై యూటీఎఫ్ సహా పలు సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు. అయితే ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఈ జీవోలో ఉన్నతీకరణ గురించి మాత్రమే ప్రస్తావించారని, పదోన్నతులు ఏ విధంగా ఇస్తారనే అంశం జీవోలో పేర్కొనలేదని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి పేర్కొన్నారు. విద్యాశాఖ పదోన్నతుల మార్గదర్శకాలతో విడిగా మరో సమగ్ర జీవోను ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రయోజనం కోసం ఉపాధ్యాయుల్లో ఆశలు రేపి అయోమయంలో ఉంచకుండా పదోన్నతులపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసి వెంటనే పదోన్నతులు కల్పించి ఉపాధ్యాయుల్లో ఉన్న ఉత్కంఠను తొలగించాలని వారు కోరారు.
ప్రతి పాఠశాలకూ హెచ్‌ఎంను నియమించాలి
ప్రతి ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు హెడ్మాస్టర్లను నియమించాలని సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సంకినేనని మధుసూధన్‌రావు, ప్రధానకార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి కోరారు. సంఘం నేతలు అంతా ఎంపీ బీ వినోద్‌కుమార్‌కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి పంచాయతీలో ఒక స్కూలు ఉండేలా చూడాలని, ప్రతి స్కూల్‌కు హెడ్మాస్టర్ ఉండాలని వారు పేర్కొన్నారు. ప్రతి తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చూడాలని ఎస్జీటీలకు లాంగ్వేజెస్ పండిట్‌లుగా పదోన్నతులు కల్పించాలని అన్నారు.