తెలంగాణ

కీలక శాఖలన్నీ కేసీఆర్ వద్దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: మంత్రులుగా మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సాయంత్రం శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక, రెవిన్యూ, విద్యుత్, మున్సిపల్, పరిశ్రమలు వంటి కీలకమైన శాఖలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు. భవిష్యత్‌లో జరిపే మంత్రివర్గ విస్తరణలో వీటిలో కొన్నింటినీ కేటాయించడానికి అనువుగా సీఎం వీటిని తన వద్దనే ఉంచుకున్నారు. కాగా మంత్రుల్లో సీనియర్ అయిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు కేటాయించగా, ప్రభుత్వం ప్రతిష్టాకరంగా అమలు చేస్తోన్న రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుకు వ్యవసాయశాఖను సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి, మరో కీలక పంచాయతీరాజ్ శాఖను ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, శాసనసభా వ్యవహారాలతో పాటు గృహ నిర్మాణం, రోడ్లు-్భవనాలు, ట్రాన్స్‌పోర్టు శాఖలు వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటాయించారు. గత మంత్రివర్గంలో న్యాయశాఖ, దేవాదాయశాఖలు నిర్వహించిన ఇంద్రకరణ్‌రెడ్డికే వాటిని అప్పగించడంతో పాటు అదనంగా గటవీ, పర్యావరణ శాఖలను అప్పగించారు. కీలకమైన పంచాయతీరాజ్ శాఖను ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కేటాయించారు. సంక్షేమశాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి వాటిని కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించారు. ఎక్సైజ్, స్సోర్ట్స్, టూరిజమ్, కల్చరల్ శాఖలను శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయించారు. ఇలా ఉండగా ఈ నెల 22న నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి గురువారం సాయంత్ర నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.