తెలంగాణ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం:దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు ప్రత్యేకించి అదనపు నిధులు కేటాయించాలని 15వ ఆర్ధిక సంఘాన్ని కోరామని అన్నారు. హైదరాబాద్ నగరంలో పట్టణ వసతులను కల్పించాలని, గ్రామాల్లో వసతులు పెంచి పట్టణ ప్రాంతాలకు వలసలు ఆపాలని కోరామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయడం లేదని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆర్ధిక లోటు ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికే ప్రభుత్వం ఎంఆర్‌బీఎం నిబంధనలను అతిక్రమించిందని, నిష్ప్రయోజన పెట్టుబడులు పెరిగిపోయాయని, బడ్జెట్‌ను గణాంకాలతో తారుమారు చేశారని దత్తాత్రేయ అన్నారు. నిధులను పెద్ద ఎత్తున ఇతర అంశాలకు తరలిస్తున్నారనిఅన్నారు.