తెలంగాణ

బడ్జెట్ పద్దులపై శని, సోమవారం చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: శాసనసభ సమావేశాలు ఈ నెల 25 వరకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దులపై శనివారం, సోమవారం రెండు రోజులు చర్చించాక చివరి రోజున ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదించాలని నిర్ణయించింది.
శాసనసభలో శుక్రవారం సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సభ వాయిదా పడ్డాక స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన ఛాంబర్‌లో శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమైంది. సభా నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు రాజాసింగ్, ఎంఐఎం సభ్యుడు బలాల, మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. సభలో శనివారం ఓటాన్ అకౌంఠ్ బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో పద్దులపై శనివారం, సోమవారం చర్చకు అవకాశం కల్పించి చివరి రోజున సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ పద్దులపై చర్చను కనీసం పది రోజులు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క కోరగా, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెటే కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం చేసిన సూచనతో ఎంఐఎం, బీజేపీ సభ్యులు ఏకీభవించడంతో ఈ నెల 25 వరకే సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.