తెలంగాణ

కాంగ్రెస్‌లో నల్లగొండ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 11: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆ పార్టీ ప్రతిష్టను రచ్చకెక్కిస్తోంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు..షోకాజ్‌ల నోటీస్‌ల జారీలతో సాగిస్తున్న రచ్చ జిల్లా కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తోంది. ఒకవైపు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇంకోవైపు పార్టీలో ఉన్న నేతలు పరస్పరం బురద చల్లుకుంటూ సాగిస్తున్న కంగాళి క్యాడర్‌లో అసహనాన్ని రగిలిస్తోంది. జిల్లాకు చెందిన పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీనేత కె.జానారెడ్డి నాయకత్వం సరిగా లేదంటూ ఇదే జిల్లాకు చెందిన సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేయడం టి.కాంగ్రెస్ వర్గాలను కుదిపేసింది. వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలను సీరియస్‌గా తీసుకున్న పిసిసి క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి వారం రోజుల్లోగా సమాధానామివ్వాలని ఆదేశించింది. అయితే తాను పిసిసి చీఫ్‌ను, ఆయన కార్యవర్గాన్ని గుర్తించడం లేదని, షోకాజ్ నోటీస్‌ను పట్టించుకోనని, తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారం పిసిసికి లేదంటూ కోమటిరెడ్డి తెగేసి చెప్పారు. ఇదే క్రమంలో వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరే ఉద్దేశంతోనే ఉత్తమ్, జానాలపై విమర్శలు గుప్పించారని, టి.కాంగ్రెస్‌లో జానా సహా చాలామంది టిఆర్‌ఎస్ కోవర్టులున్నారంటూ పాల్వాయి విమర్శలు గుప్పించారు. పాల్వాయి విమర్శలను అందిపుచ్చుకున్న వెంకట్‌రెడ్డి తాను చేసిన విమర్శలపై షోకాజ్ నోటీస్ జారీ చేసిన పిసిసి పాల్వాయికి ఎందుకు షోకాజ్ జారీ చేయలేదంటూ నిలదీశారు. ఈ పరిణామాలపై సీరియస్‌గా స్పందించిన పిసిసి క్రమశిక్షణా సంఘం శనివారం సమావేశమై ఎంపి పాల్వాయికి, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్‌లకు పార్టీ నాయకత్వంపై వారు చేసిన అనుచిత విమర్శలకు ఈ నెల 17వ తే దీలోగా సమాధానమివ్వాలంటూ షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. మరోవైపు పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపైనా, గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో పాటు మాజీ ఎంపి వివేక్, వినోద్ పార్టీ మార్పుపైనా చర్చించేందుకు నేడు పిసిసి కార్యవర్గం సమావేశమవుతుండడం ఉత్కంఠ రేపుతోంది. ఈ సమావేశంలో క్రమశిక్షణ ఉల్లంఘించే నాయకులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
అటు-ఇటు వీరే!
అసలే టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి రాష్ట్రంలో బలహీనపడిన టి.కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల మధ్య సాగుతున్న విమర్శల యుద్ధం పార్టీ అభివృద్ధికి గుదిబండగా మారింది. చిత్రంగా విమర్శలు చేస్తున్న టి.కాంగ్రెస్ నేతలు..విమర్శలకు గురవుతున్నవారు కూడా నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం..అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం కాంగ్రెస్ శ్రేణులను అసంతృప్తికి గురిచేస్తోంది. సీనియర్లుగా పార్టీలో ఉన్నత హోదాల్లో ఉంటూ ఉత్తమ్, జానా, పాల్వాయి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సాగిస్తున్న ఆధిపత్య పోరు పార్టీ మనుగడను మరింత దెబ్బతీసేలా ఉందని టి.కాంగ్రెస్‌లోని ఇతర సామాజిక వర్గాల వారు అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధం, షోకాజ్‌ల పర్వంతో రాష్ట్రంలో కాంగ్రెస్ విస్తరణకు ఎంత నష్టం జరుగుతుందో విశే్లషిస్తున్న కాంగ్రెస్‌లోని బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఢిల్లీ అధిష్టానానికి సదరు నేతల తీరును ఎండగడుతు నివేదికలు పంపుతున్నట్లుగా పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతుండటం మరో ఆసక్తికర అంశంగా మారింది.