తెలంగాణ

కౌలుకు ఇచ్చేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కౌలు రైతులకు రైతుబంధు పథకాన్ని అమలుచేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, వారికీ పాస్ పుస్తకాలు ఇస్తామని, త్వరలో ధరణి వెబ్ సైట్‌ను తీసుకుని వస్తామని ఆయన తెలిపారు. శనివారం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్‌పై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాల సభ్యులు అడిగిన ప్రశ్నలను ప్రస్తావిస్తూ స్పష్టమైన సమాధానలిచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్‌కు సభ ఆమోదం తెలిపింది. కౌలు రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం లేదని కాంగ్రెస్ సభ్యులు చేసిన విమర్శను ఆయన ప్రస్తావిస్తూ రైతుల హక్కులకు భంగం కలిగించమని, కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. కౌలు రైతులు తరచూ మారుతుంటారని, అలాంటప్పుడు వారికి ఏ విధంగా ఇస్తామని ఎదురు ప్రశ్నించారు. పాస్ పుస్తకాలు ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుందన్నారు. పాస్ పుస్తకంలో పట్టాదారు పేరు, అనుభవదారు పేరు ఉంటుందని ఆయన తెలిపారు. అనుభవదారులు మారుతుంటారని ఆయన చెబుతూ ఉదాహరణకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో లేదా ఎక్కడైనా ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అనుభవదారు పేరిట ఆ ఇల్లు రికార్డుల్లోకి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోలేమని, పట్టాదారు రైతులను తాము ఇబ్బంది పెట్టదలచుకోలేదని, వారి హక్కులను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు.
కేంద్రం ప్రకటించిన కిసాన్ సమ్మాన్‌తో రైతుబంధు పథకానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తాము ఎకరానికి రూ.10 వేలు చొప్పున చెల్లిస్తామని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము రుణ మాఫీ చేయగా బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టాయని ఆయన విమర్శించారు. బ్యాంకర్లు వడ్డీ మినహాయంచుకున్న ఘటనలు కొన్నిచోట్ల జరిగాయి కాబట్టి రైతులకు నేరుగా వడ్డీతో కలిపి రుణ మాఫీ చెక్కులు అందజేయాలన్న ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. 2018 డిసెంబర్ 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాల్లో లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి రూ.20,107 కోట్లు, ఇందులో రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు, రైతు భీమాకు రూ.650 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. భూ సర్వేను విజయవంతంగా చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకుని వస్తామన్నారు.
ప్రతిపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో సలహాలు రాలేదని, సీనియర్ సభ్యులైన శ్రీ్ధర్‌బాబు (కాంగ్రెస్) అవాస్తవాలు మాట్లాడారని ఆయన విమర్శించారు. రూ.82,200 కోట్లకు సభ ఆమోదించాల్సి ఉందన్నారు. అప్పుల విషయంలో ఆర్‌బీఐ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఎక్కడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటలేదన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లకు పైగా నిధులు వెళుతుండగా, రాష్ట్రానికి కేంద్రం కేవలం రూ.24వేల కోట్ల వరకే ఇస్తున్నదన్నారు.