తెలంగాణ

గోదావరి నీటితో కన్నీళ్లు తుడుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 11 : గోదావరి నీటిని తీసుకొచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. 2017లోగా రంగనాయక్ సాగర్ ద్వారా సిద్దిపేట నియోజక వర్గంలో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, రంగనాయక్ సాగర్ ఎడమ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల గ్రామాలకు సాగునీరు అందిస్తామని, వారం రోజుల్లో భూ నిర్వాసితులకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. మెయిన్ కెనాల్ పనులు పూర్తయిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2017లోగా సిద్దిపేటకు సాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు పుల్లూరు గ్రామ భూ నిర్వాసితులకు హరీష్‌రావు, ప్రభాకర్‌రెడ్డి చెక్కులు అందజేశారు.

చిత్రం నిర్వాసితులకు చెక్కులు అందజేస్తున్న హరీశ్, ప్రభాకర్‌రెడ్డి