తెలంగాణ

మల్లన్నసాగర్‌కు భూములు ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూన్ 13: మల్లన్నసాగర్ ప్రాజెక్టకు భూములు రిజిస్ట్రేషన్ చేసిన వారిని గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా వారికి ఎవరూ సహకరింకూడదని ఆ గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్‌లో సోమవారం జరిగింది. మల్లన్నసాగర్ నిర్మాణం వద్దని గ్రామస్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు భూములు ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలిసిన గ్రామస్థులు ఆదివారం వారి ఇళ్లపై దాడి చేసిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వచ్ఛందంగా తాను గ్రామం నుంచి పోతానని తెలపగా, సోమవారం ఉదయం గ్రామస్థులు సభ నిర్వహించి గ్రామంలో ఎవరైనా భూములు రిజిస్ట్రేషన్ చేస్తే గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించారు. వారి భూములు ఎవరూ సాగు చేయవద్దని, సహాయ సహకారాలు అందించొద్దని తీర్మానించారు.
కొనసాగుతున్న దీక్షలు
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఏర్పాటును నిరిసిస్త్తూ మండలంలోని వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాల్లో చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. ఏటిగడ్డకిష్టాపూర్‌లో అశోక్, సత్తయ్య, రాంరెడ్డి, బాల్‌రెడ్డి, వేములఘాట్‌లో అనిల్, కుమార్, నాగరాజు, కృష్ణారెడ్డి దీక్షలు చేపట్టారు. వీరికి గ్రామస్థులు సంఘీభావం తెలిపారు.
దాడికి పాల్పడిన 38 మందిపై కేసు
తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్‌కు చెందిన ఎక్కల్‌దేవ్ చంద్రం, పున్నారెడ్డి ఇండ్ల పై దాడి చేసిన 38 మందిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన తీగుళ్ల పాపిరెడ్డి, గొడుగు రాజు, నాయిని లింగం, వంజరి అనిల్, ఖానాపురం మల్లయ్య, శివంగి నర్సయ్య, అరికెల కనకయ్య, వట్టెం రామవ్వ, శివంగి బాలవ్వ, అరికెల వరలక్ష్మి, నాయిని లక్ష్మితో పాటు మరో 27 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరే కాక దాడికి పాల్పడ్డ వారిని వీడియో పుటేజ్ ద్వారా గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.

చిత్రం నిరాహార దీక్ష చేస్తున్న వేములఘాట్ వాసులు