తెలంగాణ

కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 13: నల్లగొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెనె్సస్‌డేలో ముగ్గురు మహిళలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగడం కలకలం సృష్టించింది. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గ్రీవెనె్సస్‌డేకు వచ్చిన అనుముల (హాలియా) మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన చందా లక్ష్మమ్మ, కూతురు రాధిక, పిల్లి పేరమ్మ తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కలెక్టరేట్ భవన ఆవరణలో మీద పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ హల్‌చల్ చేశారు. ఇదే సమయంలో గ్రీవెనె్సస్‌డేలో ఉన్న ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ విషయం తెలుసుకుని వారి వద్ధకు వెళ్లి సమస్యలు చెప్పాలంటూ అడిగారు. తమ గ్రామంలోని సర్వేనెంబర్ 299, 290, 285, 278, 262, 228లోని 9 ఎకరాల 10 గుంటల భూమి చెరువు నీటిలో మునిగిపోయిందని, దీంతో పంటల సేద్యానికి వీలు లేక జీవనోపాధి కష్టమైందని, వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ బాధిత మహిళలు జెసికి మొరపెట్టుకున్నారు. చందా లక్ష్మమ్మ మాట్లాడుతూ తమ కుమార్తె రాధిక భర్త పూర్ణచంద్రారెడ్డికి వివాహ సమయంలో భరణంగా ఇచ్చిన సదరు భూమి పూర్తిగా చెరువు నీటిలో మునిగి పోతుందని తెలిపారు. మిషన్ కాకతీయతో తమకు అన్యాయం జరుగుతుందని, పంటల సాగు చేసుకోకుండా భూమి అంతా ముంపు పాలవుతుందన్నారు. తమ సమస్యలపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడంతో న్యాయం కోసం కలెక్టరేట్ వచ్చి ఆత్మహత్య యత్నంతో మీ దృష్టికి సమస్యను తెచ్చే ప్రయత్నం చేశామంటూ చెప్పారు. ఇదంతా విన్న ఇన్‌చార్జ్జి కలెక్టర్ ఆత్మహత్యాప్రయత్నం నేరవౌతుందని, ఇంకోసారి ఇలాచేయడాన్ని సహించనని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మునుగోడు మండలానికి చెందిన షాహెద తన భర్త మరణిచండంతో వితంతు పింఛన్ వచ్చేదని, గతంలో తనకు గుండె ఆపరేషన్ కూడా జరిగిందని, గత మూడు నెలలుగా ఆసరా పింఛన్ ఆగిపోయిందని, కనుక ప్రస్తుతం మందులకు కూడా తన వద్ద డబ్బులు ఉండడం లేదని, ఆసరా పింఛన్‌ను వెంటనే అందించాలని వినతినందించింది. అలాగే వివిధ సమస్యలపై జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు గ్రీవెనె్సస్‌డేలో వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో జెసి సత్యనారాయణ, ఎజెసి వెంకట్‌రావు, జడ్పీ సిఇవో మహేందర్‌రెడ్డి, డిఆర్‌వో రవినాయక్, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి అంజయ్య, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నీరంజన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం ఆత్మాహుతికి ప్రయత్నించిన మహిళలు (ఎడమ), బాధితుల సమస్యలు వింటున్న ఇన్‌చార్జి కలెక్టర్