తెలంగాణ

పేద ముస్లింలకు కొత్త బట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: రాష్టవ్య్రాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రంజాన్ పురస్కరించుకుని ఈనెల 26న నిజాం కాలేజీ మైదానంలో అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎకె ఖాన్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఓమర్ జలీల్ తదితర ఉన్నతాధికారులతో సిఎం చర్చించారు. నిజాం కాలేజీలో జరిగే ఇఫ్తార్ విందుకు స్వయంగా హాజరవుతానని, దీనికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విదేశీ రాయబారులను ఆహ్వానించాలని సూచించారు. అదే రోజు రాష్టవ్య్రాప్తంగా ఇఫ్తార్ విందు నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమానికి కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. రంజాన్ సందర్భంగా రెండు లక్షల పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని, కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి 22 వరకు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో 100చోట్ల, రాష్ట్రంలోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించాలన్నారు. ఇలాఉండగా రాష్టవ్య్రాప్తంగా 3 లక్షల మంది మైనార్టీలకు ప్రభుత్వపరంగా భూపంపిణీ జరిగినట్టు అధికారిక లెక్కలు ఉన్నాయన్నారు. అయితే అవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయో విచారణ జరపాల్సిందిగా అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టు సిఎం వెల్లడించారు. విచారణ పూరె్తైన తర్వాత మైనార్టీలకు కేటాయించిన భూములను వారికే వందకు వందశాతం దక్కేలా చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.