తెలంగాణ

వివాదాల్లో సెర్చ్ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలో 8 విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకానికి ఏర్పాటు చేసిన సెర్చి కమిటీల వ్యవహారం సైతం వివాదాస్పదమవుతోంది. వివిధ విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు సెర్చి కమిటీలకు సిఫార్సు చేసిన అభ్యర్థుల స్థానే మరొకరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం వివాదానికి కారణమైంది.
సెర్చి కమిటీల్లో ప్రభుత్వ నామినీ ఒకరు, యుజిసి నామినీ ఒకరు, సంబంధిత యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఒకరు ఉంటారు. వీరు ముగ్గురూ వైస్ చాన్సలర్ పోస్టునకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ముగ్గురి పేర్లలో ఒకరిని ప్రభుత్వం తమ అభ్యర్థిగా సూచిస్తూ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్‌కు పంపితే గవర్నర్ సిఫార్సు మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం సాధారణంగా జరిగేదే. అయితే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ స్థానే ప్రభుత్వ ప్రతిపాదించిన ఒకరిని ఛాన్సలర్‌గా నియమించేందుకు వీలుకల్పిస్తూ చట్టం చేయటంతో అసలు వివాదం రగులుకుంది. విసిని నియమించాలంటే ఛాన్సలర్ అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏ యూనివర్శిటీకీ కొత్తగా ఛాన్సలర్లను ప్రభుత్వం నియమించలేదు. సరికదా చాన్సలర్ల స్థానే ప్రభుత్వమే నేరుగా నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సంకేతాలు పంపించింది. దానిని సరిపెట్టుకున్నా, సెర్చికమిటీలలో ఎపుడూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈసారి సాధారణ పరిపాలనా శాఖ నుండి ఆర్థిక శాఖ నుండి ముఖ్యకార్యదర్శులను సెర్చికమిటీల్లో నియమించారు. దానినీ పెద్ద అభ్యంతరంగా తీసుకోకున్నా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ప్రతిపాదించిన అభ్యర్థులను ప్రభుత్వమే తన ఉత్తర్వులతో తోసిరాజని కొత్త వారిని సెర్చి కమిటీల్లో సభ్యులుగా నియమించడంతో వివాదం రగులుకుంది. ఇంతకీ ప్రస్తుతం నియమించిన సెర్చి కమిటీలు చెల్లుబాటు అవుతాయా? లేదా? అనేది కూడా మీమాంసలో పడింది.
మరో పక్క కనీసం ఐదేళ్లు పరిపాలన లేదా బోధన అనుభవం ఉన్న వారిని విసిగా నియమించాలనే ఆలోచనపై హైకోర్టు చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేయడంతో విసిల నియామక జీవో చెల్లుబాటు కూడా సందిగ్ధంలో పడింది.
యుజిసి నిబంధనల ప్రకారం వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావాలంటే సీనియర్ ప్రొఫెసర్ హోదాలో కనీసం పదేళ్లు అనుభవం ఉండాలి. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర సామాజిక కార్యకర్తలను సైతం విసిలుగా లేదా ఛాన్సలర్లుగా నియమించే ప్రతిపాదన చేయడం కూడా చర్చనీయాంశం అయింది. ఇవన్నీ ఒక కొలిక్కి రాకపోవడంతో విసిల నియామకాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది.
కాగా ఉస్మానియా యూనివర్శిటీకి ఒక ప్రొఫెసర్ పేరును ఖరారు చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసేలోగానే అనుకోని సంఘటనలు జరగడంతో ఉత్తర్వులు నిలిపివేసి, కొత్త వ్యక్తి కోసం అనే్వషిస్తున్నట్టు సమాచారం.