తెలంగాణ

పోలియోపై మళ్లీ వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట డ్రైనేజీ నీటిలో పోలియో వైరస్‌ను కనిపించడంతో వైద్యరంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రభుత్వం అప్రమతమై, వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. . పోలియారహిత దేశంగా భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ఏడాదికే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలియో వైరస్ బయటపడింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట డ్రైనేజీ నీటిలో వైరస్ కనిపించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జూన్ 20నుండి 26 వరకు ముందస్తుగా పోలియో వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. 12 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. వైరస్ నిర్మూలనకు ప్రజలు వ్యాక్సినేషన్‌తో సహకరించాలన్నారు. ఆరువారాల నుంచి మూడేళ్ల వయసు గల మూడు లక్షల మంది పిల్లలకు ప్రత్యేకంగా పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. పోలియోపై నిర్వహించే సర్వే లైన్స్ టెస్ట్‌ల్లో అంబర్‌పేటలోని నాలాలో పోలియో వైరస్ కనిపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. దీనిని వ్యాక్సినేటెడ్ డిరైవ్‌డ్ పోలియో వైరస్- టైప్ 2గా గుర్తించారు. ఈ వైరస్‌ను ఇప్పటికే ఢిల్లీలో గత అక్టోబర్‌లో గుర్తించారు. బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ కనిపించింది. అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపించింది. వైరస్ నిర్మూలనకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో విడిగా సమావేశమై వైరస్ నిర్మూలకు కార్యాచరణపై చర్చించారు.
12 ప్రాంతాలు ప్రత్యేకంగా గుర్తింపు
వైరస్ -టైప్ 2 అనవాలు లభించిన అంబర్‌పేటతో పాటు బార్కాస్, కంటోనె్మంట్, డబీర్‌పురా, జంగంమెట్, కింగ్ కోఠి, లాలాపేట్, మలక్‌పేట, నాంపల్లి, పానిపురా, సీతాఫల్‌మండి, సూరజ్‌భాన్ తదితర ప్రాంతాల్లో వైరస్ ఉండే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ పనె్నండు ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్‌ల ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మానిటరింగ్ బృందాల్లో డిఎం అండ్ హెచ్‌ఓ, పిడిఐసిడిఎస్, మెప్మా పిడి, జిహెచ్‌ఎంసి, సానిటరీ వింగ్, డబ్ల్యుహెచ్‌ఓ, యూనిసెఫ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉంటారు. వీళ్లంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను చైతన్య పరుస్తారు.

చిత్రం... పోలియో నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చిస్తున్న వైద్యాధికారి రాజేష్ తివారి