తెలంగాణ

పార్లమెంట్ ఫలితాలతో చరిత్ర సృష్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మార్చి 15: నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ పార్టీ అనతికాలంలోనే దేశంలో అనేక సంచలనాలు సృష్టించిందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం రికార్డు స్ధాయిలో మెజార్టీలు సాధించి చరిత్ర సృష్టించనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో జరగనున్న పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసేందుకు శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తక్కువ సమయంలోనే దేశమంతా తెలంగాణ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటూ అనుసరించడమే కేసీఆర్ దీక్షాదక్షతకు నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సాయం అంతంతమాత్రమేనన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ భాగస్వామ్య పార్టీగా లేకపోవడం వల్లే కేంద్రం ద్వారా ఆశించిన సాయం అందుకోలేక పోయామన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగించే రాజకీయ పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. ఏళ్ల కొద్ది పాలించిన కాంగ్రెస్, బీజేపీలతో దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్న భావనలో ఉన్నారన్నారు. పక్క రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ లాంటి పాలననే కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప ప్రతిభాశాలి కేటీఆర్ అని ప్రశంసించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాలను భారీ మెజార్టీతో గెలుచుకొని కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలపర్చాలని కోరారు. నల్లగొండలో జరిగే సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని, సభకు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అలివేలు చంటిబాబు టీఆర్‌ఎస్‌లో చేరారు.