తెలంగాణ

ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 15: ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉంటూ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు పేర్కొన్నారు. రోడ్ల మంత్రిగా పనిచేస్తూ రాజీవ్ రహదారి నిర్మాణానికి రూపకల్పన చేయగా, కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే జేఎన్‌టీయూ, ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, పశువైద్య కళాశాల, న్యాక్ శిక్షణా సంస్థ ఏర్పాటులో తన వంతు క్రియాశీలక పాత్ర ఉన్నట్లు తెలిపారు. ప్రధానంగా నిరుద్యోగులు, యువతలో నిరాశా నిస్పృహలు నెలకొంటుండగా, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేత ఎంఆర్‌జీ వినోద్ రెడ్డి, ఎంపీపీ వెంకట్‌రాంరెడ్డి పాల్గొన్నారు.