తెలంగాణ

కాంగ్రెస్ ఖేల్ ఖతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్‌లోకి ఆ పార్టీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతోనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు (ఖమ్మం జిల్లా కొత్తగూడెం), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్) టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి పార్టీ మారడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇదివరకే టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుకొచ్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు అందరు ఒకేసారి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో చేరే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించినట్టు సమాచారం. ఇలా ఉండగా ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, కే ఉపేందర్‌రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్ అధిష్టానాన్ని కలిసి టీఆర్‌ఎస్‌లో చేరికకు సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు, సుధీర్‌రెడ్డి కూడా చేరడానికి ముందుకు వచ్చారు. వీరితో పాటు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఎనిమిది మంది టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్న ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 91 మంది ఎమ్మెల్యేలు ఉండగా తాజాగా తొమ్మిది మంది చేరడానికి సిద్ధపడంతో టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య సెంచరీ దాటనుంది. ఇలా ఉండగా మూడింట రెండో వంతు కాంగ్రెస్ సభ్యులు పార్టీ మారడానికి సిద్ధపడితే వారిని టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టుగా నిబంధనల ప్రకారం ప్రకటించే అవకాశం ఉంది. శాసనమండలిలో ఇటీవల నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలలో ఇద్దరు సభ్యులు ఆకుల లలితా, సంతోష్‌కుమార్ తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ప్రకటించడంతో మండలిలో కాంగ్రెస్ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్టు మండలి చైర్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనమండలి మాదిరిగా శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు రెండింట మూడవ వంతు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధపడటంతో వీరి చేరికను విలీనంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.