తెలంగాణ

ఒకటి కాదు రెండు కాదు ..32 బంగారు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 16: జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో జరిగిన డ్రాయింగ్ పోటీలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు మండలం లక్డారం గ్రామ పంచాయతి పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల విద్యార్థులు పోటీలలో అనేక బహుమతులు సాధించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 బంగారు పధకాలు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పిల్లలు కైవసం చేసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనగా మండలానికి చెందిన పిల్లలు బంగారు పతకాలు సాధించడపై పలువురు అభినందనలు తెలియచేసారు. మహారాష్ట్ర రాజధాని ముంబాయి మహానగరంలో నిర్వహించిన కంగరూస్ జాతీయ స్థాయి చిత్ర లేఖనం పోటీలలో 25 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. 25 రాష్ట్రాలలోని మూడు వేల పాఠశాలలకు చెందిన 90 వేల మంది బాలబాలికలు చిత్ర లేఖనం పోటీలలో పాలు పంచుకున్నారు. ఇందులో డ్రాయింగ్‌తో పాటు కార్టూన్ మేకింగ్, హ్యాండ్ వ్రైటింగ్, కొలేజ్ వర్క్స్, మెహందీ డిజైన్ తదితర అంశాలలో పిల్లలకు పోటీలు నిర్వహించారు. సదరు పోటీలలో మండల పరిధిలోని లక్డారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలకు చెందిన 196 మంది విద్యార్థులు చిత్ర లేఖనం పోటీలలో పాల్గొన్నారు. పోటీలకు హాజరైన 196 మంది బాలబాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వారిలో 32 మంది పిల్లలు బంగారు పతకాలు సాధించడం విశేషం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు శివకుమార్ అందించిన శిక్షణ విద్యార్థులను అంతటి స్థాయికి చేర్చింది. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడమే కాకుండా పలు బంగారు బహుమతులు సాధించేలా తీర్చిదిద్దింది. డ్రాయింగ్ పోటీలలో విద్యార్థులు 32 బంగారు పతకాలతో పాటు మూడు కన్సోలేషన్ బహుమతులు, మూడు మెరిట్ గిప్ట్ లిటిల్ స్టార్ అవార్డులను పిల్లలు సొంతం చేసుకున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించిన చిత్ర లేఖనం మాస్టారు శివకుమార్‌కు కళామిత్ర అవార్డును జాతీయ స్థాయి డ్రాయింగ్ పోటీల నిర్వాహకులు అందచేసారు. అంతటితో ఆగకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి పీపీ రాథోడ్‌కు స్వామి వివేకానంద అవార్డుతో సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహరాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగిన జాతీయ స్థాయి చిత్ర లేఖనం పోటీలలో 32 బంగారు పతకాలను సాధించిన బాలబాలికలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీపీ రాథోడ్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. డ్రాయింగ్‌లో అత్యున్నత నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులు భవిష్యత్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈసందర్బంగా ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల చిత్ర లేఖనం మాస్టారు శివకుమార్ అందించిన శిక్షణ కారణంగా పిల్లలు జాతీయ స్థాయి పోటీలలో సత్తా చాటే అవకాశం లబించిందన్నారు. ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు పతకాల వేటలో వేల మంది విద్యార్థులతో పోటీ పడ్డారని వివరించారు. ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన రీతిలో ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
చిత్రం.. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులతో అధ్యాపకులు