తెలంగాణ

రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాను బుధవారం నాడు సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ చెప్పారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల జాబితాకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయిందని, జాబితా వెల్లడించడమే మిగిలిందని అన్నారు. ఇటీవల జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జరిగిన భేటీలోనూ, పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ బోర్డులో తెలంగాణ నుండి అభ్యర్ధుల పేర్లపై చర్చ జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారన్నారు. రాష్ట్ర ప్రజలు దేశం కోసం బీజేపీకి , నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించామని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకుని మహిళలకు, ఆదివాసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా, పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా పాలనను గాలికి వదిలేశారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని సేవకుడిని అని రాహుల్ గాంధీ ప్రకటించుకోవడంపై లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మాదిరిగా తామూ చౌకీదారులుగా కొనసాగుతామని చెప్పారు. తామంతా చౌకీదారులుగా పేరుమార్చుకుంటామని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ విషయంలో టీఆర్‌ఎస్, ఆ పార్టీ నేత కవిత చేసిన వ్యాఖ్యలు దారుణమని, వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హిందుత్వానికి ప్రతీక అనే విధంగా చెబుతూనే మరో పక్క మజ్లిస్‌కు కేసీఆర్ ఏ విధంగా వత్తాసు పలుకుతున్నారని నిలదీశారు. హిందువుగా చెప్పుకుంటున్న కేసీఆర్ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై రాజకీయ పార్టీగా తమ వైఖరి ఏమిటో కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డుపడ్డ ఎంఐఎం పార్టీ ఏ విధంగా సహజ మిత్రుడో కూడా తేల్చి చెప్పాలని అన్నారు. కేసీర్ ద్వంద్వ వైఖరిని, మాయమాటలను, అబద్దాలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని అన్నారు. దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం అనే రీతిలో ప్రజలు ఎదురుచూస్తున్నారని, తెలంగాణ బిల్లు లోక్‌సభకు వచ్చిన సమయంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఆయనే చెప్పాలని అన్నారు. జాతీయ పార్టీ పెడతానన్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో కూడా చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ ఇకనైనా పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. అంతకుముందు బీజేపీ కార్యాలయంలో గోవా సీఎం మనోహర్ పారికర్‌కు నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బీ. జనార్ధన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రఘునందన్ రావు, ఎన్‌వీ సుభాష్, ఆర్. శ్రీ్ధర్ రెడ్డి, ఆకుల విజయ, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.