తెలంగాణ

16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొంటాం: ఇంద్రకరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్‌రూరల్, మార్చి 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ నుండి 29 రాష్ట్రాలలో ఓ ప్రత్యేకమైన రాష్ట్రంగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎల్ ఆర్ గార్డెన్‌లో మంగళవారం ఏర్పటుచేసిన పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకబాటు పడిందన్నారు. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బానిస బతుకు వలసలు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే అన్ని రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నామని అభివర్ణించారు. జూన్ మాసం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా సుందిళ్ల మేడిగడ్డ, ప్రాంతాల నుండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా రోజుకు ఒక టీ ఎంసీ చొప్పున నీరు చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో 1800 టీ ఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిపోయాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ మాసంలోగా పూర్తవుతుందని, అప్పుడు రైతాంగం ఊహించని రీతిలో అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. నేటి పార్లమెంట్ 17 స్థానాలలో 16 స్థానాలు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఖానాపూర్ రైతులు మంత్రిని గోదావరిలో నీరులేక పశువులకు తాగునీరు లేక అల్లాడిపోతున్నాయని తెలియజేశారు. ప్రస్తుత ప్రాజెక్టులో 100 ప్రాజెక్టులు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్టగా వేశారన్నారు. ప్రస్తుతం ఉన్న నీరు మిషన్ భగీరథకు వాడుకోవడం జరుగుతుందన్నారు. అయినప్పటికి ముఖ్యమంత్రితో చర్చించి గోదావరిలోకి పశువులకు తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోయే ఎంపీ అభ్యర్థి స్థానాన్ని ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఖానాపూర్ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదగడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ నగేష్, డైరీ చైర్మెన్ లోక భూమారెడ్డి, ఉమ్మడి జిల్లా అదివాసి సంఘం చైర్మెన్ లక్కే కనకారావు తదితరులు పాల్గొన్నారు.