తెలంగాణ

ఖాళీ అవుతున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తుండడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు తదితర ఎమ్మెల్యేలు ‘కారు’ ఎక్కిన సంగతి తెలిసిందే. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును కలిసి చర్చించారు. తొలుత తన కుమారుడు కార్తీక్ రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్పించారు. ఇంకా ఎమ్మెల్యేల వలస కొనసాగుతూనే ఉంది. ఇంతలో బీజేపీ కూడా రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నాయకులనూ సంప్రదించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణను సంప్రదించి పార్టీలో చేరుకున్నది. అంతేకాకుండా మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. దీంతో పార్టీ కార్యాలయం (గాంధీ భవన్)లో డీకే అరుణ గది ముందు ఉన్న ఆమె నేమ్‌ప్లేట్‌ను సిబ్బంది తొలగించింది. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణనూ సంప్రదించింది. వరంగల్ లోక్‌సభ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆహ్వానించింది. కానీ మల్కాజిగిరి సీటు ఇస్తామంటే చేరుతానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఇంకా మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రాంచందర్ రావు పోటీ చేస్తున్నందున, ఇప్పుడు ఆయన్ను కాదని సర్వేకు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీ ఆహ్వానించింది. పార్టీలో చేరితే మెదక్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తామని తెలిపింది. అయితే మెదక్‌లో కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా వెనుకబడి ఉన్నందున పోటీ చేయడం ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. కాగా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారం చేపడితే ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తామని పార్టీ నాయకులు ఆమెకు చెబుతున్నట్లు సమాచారం. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె తెలిపారు. మరోవైపు సీఎల్‌పీ మాజీ నేత కే. జానారెడ్డి కుమారునికి, మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్‌తో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీలో చేరి తండ్రీ-కుమారునికి ప్రాధాన్యతనిస్తామని చెబుతున్నారు.