తెలంగాణ

అడ్మిషన్లకు షెడ్యూలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌనె్సలింగ్‌కు బుధవారం షెడ్యూలు ఖరారు చేశారు. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ డాక్టర్ ఎంవి రెడ్డి షెడ్యూలును విడుదల చేశారు. 22న 1నుండి 6 వేల ర్యాంకు వరకూ షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలన మొదలై జూలై 1న 92001 నుండి చివరి ర్యాంకు వరకూ జరుగుతుంది. ఇదంతా పూరె్తైన తర్వాత 25 లేదా 26 నుండి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఒక పక్క సర్ట్ఫికెట్లు పరిశీలన చేసుకున్న వారు రెండు రోజుల వ్యవధి తర్వాత వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలుంది. రోజూ అందరూ ఒకే హెల్ప్‌లైన్ సెంటర్‌కు వెళ్లకుండా తెలంగాణ మొత్తం మీద హెల్ప్‌లైన్ సెంటర్లకు ర్యాంకర్లను పంపిణీ చేశారు.
తీసుకురావల్సిన సర్ట్ఫికెట్లు
అభ్యర్థులు తమ సర్ట్ఫికెట్లు ఒరిజనల్స్‌తో పాటు రెండు జిరాక్స్ సెట్లు తీసుకురావాలి. అలాగే ర్యాంకు కార్డు, హాల్‌టిక్కెట్, ఆధార్ కార్డు, మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ఆరో తరగతి నుండి ఇంటర్ వరకూ స్టడీ సర్ట్ఫికెట్లు, టిసి, ఇన్‌కమ్ సర్ట్ఫికేట్, కుల ధృవీకరణ, పిహెచ్‌సి, ఎన్‌సిసి, మైనార్టీ సర్ట్ఫికేట్లు, నాన్ లోకల్ అభ్యర్ధులు రెసిడెన్షియల్ సర్ట్ఫికేట్లు తీసుకురావాలి. ఇతర వివరాలకు అభ్యర్ధులు టిఎస్‌ఎంసెట్ డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఎప్పటికపుడు సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు వెయ్యి రూపాయిలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు 500 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ట్యూషన్ ఫీజు ఇతర వివరాలు వెబ్‌పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తామన్నారు. అలాగే స్పెషల్ కేటగిరి అభ్యర్ధులు మాత్రం 23నుండి హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్‌లో జరిగే కౌనె్సలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుందన్నారు. 23న ఆంగ్లో ఇండియన్లకు, 24న ఆర్దో పిహెచ్, స్పోర్ట్సు- గేమ్స్ అభ్యర్ధులు, 25న క్యాప్ కేటగిరి అభ్యర్ధులు, గేమ్స్ కోటా అభ్యర్ధులు, 27 నుండి ఎన్‌సిసి అభ్యర్ధులు కౌనె్సలింగ్‌కు హాజరుకావల్సి ఉంటుంది.
తేలని ఫీజులు
కాలేజీల ఫీజులు ఇంకా స్పష్టంగా తేలకున్నా ముందుగా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో కాలేజీల వారీ ఫీజులపై చాలా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.