తెలంగాణ

ఎగ్జిబిషన్లు, వేడుకల్లో ప్రజల భద్రతే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్రంలో ఎగ్జిబిషన్లు, పబ్లిక్ మీటింగ్‌లు, వేడుకలు, ఉత్సవాల నిర్వహణకు అగ్నిమాపక, మున్సిపల్, పోలీస్, విద్యుత్ తదితర శాఖల అనుమతి మంజూరు చేసేందుకు అవసరమైన ముసాయిదా నియమాళిని వారంరోజుల్లోగా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ ఈవెంట్ల అనుమతులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివిధ శాఖల అనుమతికి దరఖాస్తు చేసేందుకు సింగిల్ అప్లికేషన్ ఫాంను రూపొందించాలన్నారు. నుమాయిష్, చేపప్రసాదం పంపిణీ తదితర ఈవెంట్స్ ఏటా జరుగుతూ ఉంటాయని గుర్తు చేశారు. వీటికి సంబంధించ మాడల్ లేఅవుట్‌ను రూపొందించాలని సూచించారు. శాశ్వత భవనాలు, తాత్కాలిక భవనాలు, హైరైజ్ భవనాలు, ఫంక్షన్ హాళ్లు తదితర క్యాటగిరీలుగా విభజించి నియమావళిని రూపొందించాలని సీఎస్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు అనుమతి ఇచ్చే ముందు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలన్న నిబంధన తప్పక ఉండాలన్నారు. అత్యవసర ఎగ్జిట్స్, ఫైర్ ఇంజన్ సులువుగా వెళ్లేందుకు వీలుగా రహదారులు, సైనేజ్, పార్కింగ్ ఉండాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేదీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, ఫైర్‌సర్వీస్ డీజీ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులో సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి