తెలంగాణ

ఈ ఎన్నికలు రాహుల్.. మోదీ మధ్యే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 20: పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయికి సంబంధించినవని, ఈ ఎన్నికల పోటీ రాహుల్ వర్సేస్ మోదీకే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహా అన్నారు. జాతీయ పార్టీల ఎన్నికల్లో కేసీఆర్ జోక్యమేంటో అర్థం కావడం లేదని, 16 సీట్లు గెలిచి ఏం సాధిస్తావని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉన్న 15 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని సంగారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌కు ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం ఉందన్నారు.డిల్లీకి వెళ్లి కాళ్లుపట్టుకోవడం, ఇక్కడి సమావేశాల్లో మోదీపై తిట్ల వర్షం కురిపించడం కేసీఆర్ నైజమన్నారు. ఇవి టీఆర్‌ఎస్ ఎన్నికలు కాదు జాతీయ ఎన్నికలన్నారు.
ఇందిరాగాంధీ పోటీ చేసి ప్రధాని అయిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని, నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి జహీరాబాద్ ఎంపీ స్థానం గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అటెండర్లతో సమానమని ఎద్దేవా చేశారు. అచ్చేదిన్ అంటూ మోదీ దేశాన్ని బ్రష్టుపట్టించారని, నోట్ల రద్దుతో ప్రజలను రోడ్లపాలు చేసాడని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపుతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్, జహీరాబాద్ పార్లమెంట్ పోటీ అభ్యర్థి మదన్ మోహన్‌రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో అభివాదం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు