తెలంగాణ

ఉగ్రనారసింహుని డోలోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 21: జగిత్యాల జిల్లా పరిధిలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా గురువారం సాయంత్రం నుండి రాత్రి వరకు శ్రీఉగ్ర నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం క్షేత్ర సనాతన సాంప్రదాయ పద్దతిలో ఉగ్రనారసింహ స్వామి ప్రధానాలయం నుండి వేదమంత్రోచ్ఛాటనల, మంగళవాద్యాలతో, భక్తజనం తోడురాగా స్వామి ఉత్సవ మూర్తులను జయజయ ధ్వనాలతో ఊరేగించి, బ్రహ్మపుష్కరిణిలోనికి కోనేరు ఉత్తర ద్వారం గుండా వేంచేపుచేయగా, అప్పటికే కోనేటిలో ఆసీనులై వేచియున్న అశేష భక్తజనం తమ ఇష్ట దైవాన్ని ఘనంగా స్వాగతించారు. అజ్ఞాత భక్తునిచే ప్రత్యేక నూతన నిర్మిత, బహూకృత హంస రూపు బల్లకట్టుపై స్వామిని ఆసీనులజేసి, కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించారు. బ్రహ్మపుష్కరిణి సోపానాలపై నున్న భక్త జన సమూహం ప్రదక్షిణలను మెట్ల పై నుండి అనుసరించారు. బుక్కా, గులాలు ఇత్యాది పూజా ద్రవ్యాలు ఉత్సవ మూర్తులపై చల్లి భక్తి శ్రద్దలతో కైమోడ్పులిడి ప్రార్థించారు. అనంతరం కోనేరు మధ్య భాగానగల వేదికపైనున్న భోగమంటపంలోని ఊయలలో స్వామిని ఆసీనులగావించి డోలోత్సవ వేడుకలను జరిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు ఇరుకైన మార్గంగుండా ప్రవేశించి, మొక్కులు చెల్లించుకున్నారు.