తెలంగాణ

బీజేపీ తుది జాబితా నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 10 మంది అభ్యర్ధుల జాబితాను బీజేపీ అధినాయకత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. సికింద్రాబాద్ నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను పార్టీ పక్కన పెట్టింది. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్ధులు హోరాహోరీ పోరాడినా చివరికి జీ. కిషన్‌రెడ్డికి అవకాశం దక్కింది. పార్టీ నాయకత్వం పోటీ చేయమంటే తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ప్రకటించినా ఆయనకు అవకాశం దక్కలేదు. పార్టీ నాయకత్వం గురువారం రాత్రి కరీంనగర్‌కు బండి సంజయ్, నిజామాబాద్‌కు డీ. అరవింద్, మల్కాజ్‌గిరికి ఎన్. రామచందర్‌రావు, సికింద్రాబాద్‌కు జీ. కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు డీకే అరుణ, నాగర్‌కర్నూలుకు బంగారు శృతి, నల్గొండకు గార్లపాటి జితేందర్‌కుమార్, భువనగిరికి పీవీ శ్యాంసుందర్ రావు, వరంగల్‌కు చింతా సాంబమూర్తి, మహబూబాబాద్‌కు జటొత్ హుస్సేన్ నాయక్‌ల అభ్యర్ధిత్వాలను ఖరారు చేసింది. జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాల పేర్లను శుక్రవారం నాడు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణకు మహబూబ్‌నగర్ లోక్‌సభ నుండి పోటీ చేసే అవకాశం దక్కడం విశేషం. మెదక్ నుండి రఘునందనరావు గట్టి పోటీలో ఉన్నా, కాంగ్రెస్ నుండి వచ్చే సీనియర్ నేతల కోసం బీజేపి అధినాయకత్వం ఎదురుచూస్తోంది. అదే విధంగా చేవెళ్ల నుండి జనార్ధనరెడ్డి గట్టి పోటీలో ఉన్నా, ఇద్దరు ముగ్గురి పేర్లను కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది. హైదరాబాద్ నుండి అమర్‌సింగ్ పేరు వినిపిస్తున్నా ఆయనకు బదులు వేరే గట్టి అభ్యర్ధి కోసం పార్టీ అనే్వషిస్తోంది.
తర్యా తండా నుండి లోక్‌సభకు
మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్ధి జటొత్ హుస్సేన్ నాయక్ గూడూరు మండలం ముచ్చర్ల గ్రామం తర్యా తండాకు చెందిన వారు. బీఏ వరకూ చదివిన నాయక్ హైరిచ్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ అధినేతగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ సేన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాయక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్ నియోజకవర్గం సీటు తనకు కేటాయించడంపై జీ కిషన్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు. తనకు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని , ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ తనకు ఆ విధంగా ఓట్లు వేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. 25వ తేదీన తాను నామినేషన్ వేస్తానని, హైదరాబాద్ నగరాన్ని మినీ ఇండియాగా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
ఖరారు కావాల్సిన అభ్యర్ధులు వీరే..
హైదరాబాద్: అమర్‌సింగ్,
చేవెళ్ల: నందకుమార్ యాదవ్, ఖమ్మం: వాసుదేవరావు,
పెద్దపల్లి: ఎస్. కుమార్,
ఆదిలాబాద్: సోయం బాపూరావు, మెదక్: రఘునందనరావు,
జహీరాబాద్: బాణాల లక్ష్మారెడ్డి.