తెలంగాణ

‘పేట’ కమలంలో జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట, మార్చి 21: సార్వత్రిక ఎన్నికల వేళ.. నారాయణపేట జిల్లాలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను, డీకే అరుణను నమ్ముకుని కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేతలంతా ప్రస్తుతం తాము ఎవరికీ మద్దతివ్వాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని ధన్వాడ మండలంలో పుట్టిపెరిగిన డీకే అరుణకు నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు, అనుచరగణం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన కుంభం శివకుమార్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించడంలో విఫలమైన డీకే అరుణ స్వతంత్ర అభ్యర్థిగా తన మద్దతుదారుడిని బరిలో నిలపగా కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా పోగా అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థితో పోటా పోటీగా 54వేల పైచిలుకు ఓట్లను దక్కించుకుని తమ సత్తా చాటారు. అయితే మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ముందుగా జైపాల్‌రెడ్డి ఆసక్తి కనబరచినా గ్రూపు రాజకీయాలకు వెరసి ఆయన పోటీ నుండి తప్పుకోగా డీకే అరుణ ఈ స్థానం నుండి కాంగ్రెస్ తరఫున నిలుస్తారని విస్తృత ప్రచారం సాగింది. అయితే, కాంగ్రెస్ నుండి పోటీ చేయడం ఇష్టం లేని డీకే అరుణ సున్నితంగా కాంగ్రెస్ నుండి తప్పుకుని బీజేపీ జాతీయ నాయకులతో చర్చించి గత మంగళవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఈ విషయంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుండి డీకే అరుణ పోటీ తథ్యమంటూ బీజేపీ శ్రేణులు బహిరంగంగా వాఖ్యానిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. నారాయణపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న బలమైన క్యాడర్‌కు తోడు డీకే అరుణ వర్గీయులు, ఆమె బంధువులు సైతం ఈ జిల్లాలో అధికంగా ఉండటంతో పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు మెజార్టీ ఇవ్వనుండగా దానికి తోడు దేవర్‌కద్ర, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణులను తనవెంటేసుకుని గెలిచే ఏర్పాట్లు చేసుకుంటున్నారని బీజేపీ శ్రేణులు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ఇంకా ఎంపీ అభ్యర్థి పేరును ఖరారు చేయకపోయినా జిల్లాలోని బీజేపీ నాయకులు మాత్రం డీకే అరుణ బీజేపీ నుండి పోటీ చేయడం ఖాయమని ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న స్థిరమైన ఓట్లతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో వచ్చిన నామమాత్రపు ఓట్లకు తోడు మాజీ మంత్రి డీకే అరుణ ఓట్లతో ఈ దఫా మహబూబ్‌నగర్ నుండి బీజేపీ గెలవనుందని బీజేపీ వర్గాలు వాఖ్యానిస్త్తున్నాయి. దీనికి తోడు గతంలో బీజేపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించి టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ జితేందర్‌రెడ్డికి ఈ దఫా టీఆర్‌ఎస్ టికెట్ కేటాయించే విషయంలో ఆచితూచి అడుగువేస్తున్న నేపథ్యంలో ఎంపీ జితేందర్‌రెడ్డి టికెట్ దక్కకపోతే ఆయన వర్గీయులు సైతం తమకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని బీజేపీ ఆశిస్తోంది.