తెలంగాణ

ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూరు, మార్చి 21: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ అభ్యర్ధిగా తనను భారీ మెజార్టీతె గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం చండూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, జిల్లాలో కృష్ణా నీటికోసం 11రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు.
ఎంపీగా గెలిపిస్తే బ్రాహ్మణవెళ్లెంల, చర్లగూడెం రిజర్వాయర్‌లను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి మానసిక వైద్య పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలు రాహుల్‌కు, మోడీకి మధ్య పోటీగా ఆయన అభివర్ణించారు. పేదల ఎకౌంట్‌లో 15లక్షల రూపాయలు వేస్తానని మోడీ మోసం చేశారన్నారు. నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకోసం తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 25న నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గత ఔదు సంవత్సరాల్లో 300 ఎకరాల భూమి తన బినామీల పేర్ల మీద కొనుగోలు చేశాడని, అందుకే నియోజకవర్గంలో అనేకసార్లు పర్యటించాడు తప్పా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాదు అని చెప్పారు. అందుకే ప్రజలు ఆయనను ఓడించారని తెలిపారు. తాను ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. భువనగిరి ఎంపీగా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుజా ఉద్దీన్, ఎంపీపీ తోకల వెంకన్న, కర్నాటి వెంకటేశం, అనె్నపర్తి శేఖర్, కావలి ఆంజనేయులు, కోడి గిరి, కోడి శ్రీను, ధోటి వెంకటేశ్, పున్నా ధర్మేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.