తెలంగాణ

మహిళలకు బీజేపీలో పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: మహిళలకు బీజేపీలో ఎపుడూ పెద్దపీట ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వెంటనే హైదరాబాద్ చేరుకున్న డీకే అరుణ గురువారం నాడు పలువురు బీజేపీ నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటు బీజేపీ నుండి, అటు కాంగ్రెస్ నుండి అరుణకు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ హర్షామోదాలు తెలియచేస్తున్నారు. మరో పక్క బీజేపీ నేతలు ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. దత్తాత్రేయ నివాసానికి వచ్చిన అరుణ ఆయనతో కొద్ది సేపు చర్చలు జరిపారు. పార్టీలో పనిచేసేవారికి ఎపుడూ ప్రాధాన్యత ఉంటుందని, కేంద్ర మంత్రివర్గంలోనూ మహిళలకు ప్రధాని పెద్దపీట వేశారని, కీలక పదవుల్లో వారు పనిచేస్తున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌లోని కొంత మంది నేతలు సైతం తన నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారని అరుణ పేర్కొన్నట్టు తెలిసింది. బీజేపీకి చెందిన జీ. కిషన్‌రెడ్డిసహా ఇతర ముఖ్య నాయకులతో కూడా అరుణ భేటీ అయ్యారు.
సంచలన ఆరోపణలు
జైపాల్‌రెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డిసహా పలువురు కాంగ్రెస్ నేతలపై అరుణ సంచలన ఆరోపణలు చేశారు. జైపాల్‌రెడ్డి జనతాదళ్‌ను బొంద పెట్టారని, ఇపుడు కాంగ్రెస్‌ను బొందపెట్టే పనిలో పడ్డారని విరుచుకుపడ్డారు. జైపాల్‌రెడ్డి ఒక మేథావి అనుకొని, ఆయన సలహాలతో ఉత్తమకుమార్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి, నేతలు పార్టీలు మారడానికీ కారణం వీరేనని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో తనకు వ్యతిరేకంగా వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డితో కలిసి ఉత్తమ్ ఒక గ్రూప్ తయారుచేశారని, వారితో తనకు వ్యతిరేకంగా మాట్లాడించారని ఆరోపించారు. తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నందునే తనపై ఉత్తమ్ కక్ష కట్టారన్న అరుణ చాలా మంది కాంగ్రెస్ నేతలు తనకు ఫోన్ చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి ఇంటికి ఉత్తమ్ వెళ్లారని, కానీ ఆమెను పార్టీ మారవద్దని చెప్పలేదని అరుణ వివరించారు. టీఆర్‌ఎస్‌లో చేరమని ఆఫర్ వచ్చిందని, కానీ ఆ పార్టీపై పోరాడిన తాను మళ్లీ అందులో ఎలా చేరుతానని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారని, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని ఆమె అన్నారు. కాంగ్రెస్‌లో ఎన్నో గ్రూపుల మధ్య పనిచేసిన తనకు బీజేపీలో కొనసాగడం కష్టమేమీ కాదని చెప్పారు.
చిత్రం.. బండారు దత్తాత్రేయను కలిసి మాట్లాడుతున్న డీకే అరుణ