తెలంగాణ

కేసీఆర్‌ది నిరంకుశ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన సాగుతోందని బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్‌ది నిరంకుశ పాలనగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన అరుణ శుక్రవారం నాడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చినపుడు ఘనస్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. ఈ సందర్ధంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ఏకపక్ష పాలన వల్ల మంత్రులు సైతం తమ కార్యాలయాల్లో ఏ నిర్ణయం తీసుకోలేని దుస్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. పార్టీలో అంతా కలిసి పనిచేస్తామని, లోక్‌సభ ఎన్నికల్లో నాలుగైదు స్థానాలు గెలుచుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రధానిని అవుతానంటూ చెప్తున్న కేసీఆర్ అసలు బరిలోనే లేరని గుర్తుచేశారు. దేశంలో తిరిగి బీజేపీ అధికారంలో రావడం ఖాయమని అన్నారు. దేశంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని అన్నారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటుందని, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ డీలా పడుతోందని అరుణ అన్నారు. కాంగ్రెస్ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తాను తీసుకున్నట్టు అరుణ చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు అంతా కోరుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణ భవిష్యత్తు కూడా బీజేపీ నాయకత్వంలోనే నెరవేరుతాయని తాను భావిస్తున్నానని అన్నారు. త్వరలోనే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యంటించనున్నారని, ఆ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావిస్తారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి లేకపోవడం వల్లే తెలంగాణకు ఇంతకాలం నష్టం జరిగిందని ఆరోపిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏం సాధించామని అరుణ ప్రశ్నించారు. ప్రజలు కోరుకున్నది ఇటువంటి తెలంగాణ కాదని, ప్రజాస్వామ్య తెలంగాణ కోరుకున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య అలాగే ఉందని, టీచర్లు లేరని, ఏ సమస్యలనూ పరిష్కరించకుండా ఓటు రాజకీయాలతోనే సర్కారు ముందుకు పోతోందని దుయ్యబట్టారు. సమస్యలను పరిష్కరించే యోచనలో టీఆర్‌ఎస్ లేదని, అలాంటి పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోతోందని అరుణ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పనిలో నేతలున్నారని, అందుకే తాను బీజేపీలోకి వచ్చానని అరుణ వివరించారు.