తెలంగాణ

డిజిటల్ అక్షరాస్యతలో బాసరకు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి క్షేత్రం మొదటి గ్రామంగా నిలిచింది. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక్కో విద్యార్థి చొప్పున 460 మందికి డిజిటల్ అక్షరాస్యతలో పట్టాలను అందజేశారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఘనత సాధించినందుకుగాను బుధవారం హైదరాబాద్‌లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ చేతుల మీదుగా బాసర సర్పంచ్ శైలజ సిఎస్‌సి అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలజ హైదరాబాద్ నుండి ఫోన్‌లో మాట్లాడుతూ డిజిటల్ అక్షరాస్యతలో బాసరను పూర్తి డిజిటల్ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషిచేసిన ప్రజాప్రతినిధులు, ట్రిపుల్ ఐటి యూనివర్సిటీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.