తెలంగాణ

కాంట్రాక్టుల కోసం కాదు... అభివృద్ధి కోసమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 16: కాంట్రాక్టుల కోసమే తాము టిఆర్‌ఎస్‌లో చేరామంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఎంపి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించడం పూర్తి అవాస్తవమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు ఖండించారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న నేతల్లో అనేకమంది టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారని మరి వారి సంగతేమిటో దిగ్విజయ్ చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్‌లో ఉన్నవారు కాంట్రాక్టులు చేయవద్దని పార్టీ నిబంధన విధిస్తే కాంట్రాక్టుల రగడకు తెరపడుతుందంటూ ఆయన హితవు పలికారు. తనకు, తన కుటుంబంలో ఎవరికి కూడా కాంట్రాక్టర్లుగా పనిచేసిన చరిత్ర లేదన్నారు. కేవలం తన వియ్యంకుడు మాత్రమే నిజాం కాలం నుండి పేరుమోసిన కాంట్రాక్టర్ కొనసాగుతున్నారని, ఆయన కాంట్రాక్టులకు, తనకు లింక్ పెట్టి విమర్శించడం తగదన్నారు. తాను 800 కోట్ల కాంట్రాక్టు పొంది టిఆర్‌ఎస్‌లో చేరానంటూ పాల్వాయి విమర్శించడం అవాస్తవమని, ఎంపి నిధులను కమీషన్లకు అమ్ముకునే సంస్కృతి తనది కాదని, ఎదుటి వారిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పక రాజీనామా చేస్తానని, అప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో దమ్ము, ధైర్యం ఉంటే వెంకట్‌రెడ్డి పోటీ చేసుకోవచ్చన్నారు. పార్టీ మారుతున్న విషయాన్ని ముందుగానే కాంగ్రెస్ పెద్దలందరికీ చెప్పి మరి పార్టీ మారానని అన్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలో ఉంచాలన్న డిమాండ్‌తో పాటు యాదాద్రి ప్లాంట్ నిర్మాణం, నియోజకవర్గ అభివృద్ధి కోరుతూ మాత్రమే తాను సిఎం కోరిక మేరకు టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. అంతేతప్ప తనకు ఎలాంటి కాంట్రాక్టులు లేవన్నారు. జానారెడ్డి అనుచరుడిగా 40 ఏళ్లుగా ఆయనకు సంబంధించిన అన్ని రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షించిన తాను ఏనాడూ ఎవరి వద్ద ఒక్క రూపాయి చేయి చాచలేదన్నారు. దీనిపై ఏ గుడిలోనైనా ప్రమాణాలకు సిద్ధమని తనకు ఎలాంటి అవినీతి మరకలు లేవని, ఒకవేళ ఎవరైనా నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు.