తెలంగాణ

రైతు చుట్టూ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్ (నిజామాబాద్), మార్చి 24: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎర్రజొన్న, పసుపు పంటలు కేంద్ర బిందువుగా మారాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు రైతుల చుట్టే తిరుగుతూ, దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అత్యధికంగా సాగయ్యే పసుపు, ఎర్రజొన్న పంటల విషయమై ప్రారంభమైన వివాదం, రైతులు నామినేషన్లు వేయడంతో పాటు ప్రధాన పార్టీలు కూడా రైతుల చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పటికే అధికార తెరాస రైతులతో సంప్రదింపులు జరుపుతుండగా, బీజేపీ కూడా ఆర్మూర్‌లో పసుపు, ఎర్రజొన్నల పంటలే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. రైతును ఏకగ్రీవంగా ఎన్నుకుందామంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. రైతులు కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వాస్తవానికి పసుపు, ఎర్రజొన్న పంటల గిట్టుబాటు ధర ఆందోళన ఆర్మూర్ కేంద్రంగా మారింది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో పసుపు పండించే ప్రాంతాల్లో ఆర్మూర్ డివిజన్ మొదటి స్థానంలో ఉంది. ఎర్రజొన్న పంటను కూడా ఇక్కడే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. అయితే పసుపు, ఎర్రజొన్నల గిట్టుబాటు ధరల విషయమై దాదాపు దశాబ్ధకాలంగా ఉద్యమాలు సాగుతున్నాయి. పసుపు విషయంలోనైతే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు జరిగాయి. ప్రతియేటా పంటల ఉత్పత్తులు అమ్మే సమయంలో వ్యాపారులు ధరలు తగ్గించేస్తుండటం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో యేటేటా ఈ ఆందోళన పెరుగుతూనే వస్తోంది. పసుపు బోర్డు ఏర్పాటుతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతు నేతలు చెబుతున్నా, దాని విషయంలో ఇంకా తాత్సారం కొనసాగుతూనే ఉండటం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ప్రతి సంవత్సరం వలే ఈసారి కూడా పసుపు, ఎర్రజొన్నల గిట్టుబాటు ధర విషయంలో ఆందోళనలు మిన్నంటాయి. రాస్తారోకోలు, రహదారుల దిగ్భందాలు, రోడ్లపైనే వంటావార్పు, డివిజన్ బంద్ తదితర కార్యక్రమాలు జోరుగా సాగాయి. ప్రారంభంలో క్వింటాళు పసుపు 8వేల వరకు ధర పలికినప్పటికీ, దిగుబడులు పెరిగినా కొద్దీ అదేరీతిన ధర క్రమంగా తగ్గుతు 4,500వేలకు పడిపోవడం రైతులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈసారి పసుపు పంట మంచి నాణ్యతతో పండించినప్పటికీ ,వ్యాపారులు మాత్రం ధరను తగ్గించేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేశారు. కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించడంతో ఎర్రజొన్నల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఈసారి చాలామంది రైతులు ఎర్రజొన్నలను అమ్మకుండా ఇండ్ల వద్దే నిల్వ ఉంచుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తమ నిరసనలను తెలుపడానికి రైతులు పార్లమెంట్ ఎన్నికలను ఒక వేదికగా మల్చుకున్నారు. గ్రామానికి ఇద్దరు చొప్పున పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల్‌కు చెందిన రైతులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయం వేడెక్కింది. దాదాపు 57 వరకు రైతులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. రైతుల నామినేషన్ ఖర్చులను గ్రామంలోని అభివృద్ధి కమిటీలు భరిస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితి ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో రాజకీయ పార్టీలు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికార తెరాస రైతులతో సమావేశాలు నిర్వహించింది. బీజేపీ కూడా ఆర్మూర్‌లో సోమవారం రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. పసుపు, ఎర్రజొన్నల గిట్టుబాటు ధరల విషయంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతునే ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ప్రకటించింది. ఎలాగోలా రైతులను సముదాయించి నామినేషన్లను ఉపసంహరించేలా నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయన్నది ఉపసంహరణ గడువు ముగిస్తేగానీ తేటతెల్లం కాదు. ప్రస్తుతం మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికలు రైతుల సమస్యల చుట్టే పరిభ్రమిస్తుండటంతో అన్ని పార్టీలు నిజామాబాద్ వైపే దృష్టి సారించాయి.

చిత్రాలు.. పసుపు, ఎర్రజొన్న