తెలంగాణ

ఎంపీ కవితకు తలనొప్పిగా మారిన ‘నిజాం సుగర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 25: గత ఉద్యమ కాలం నుండి తెరాసకు ప్రచారాస్త్రంగా మారిన నిజాంచక్కెర కర్మాగారం నేడు ఎంపీ కవితకు తలనొప్పి వ్యవహారంగా తయారయ్యింది. ఫ్యాక్టరీ విషయాన్ని ఎటూ తేల్చలేక పోవడం ప్రతిపక్షాలకు చక్కెర కర్మాగారం ప్రచారాస్త్రంగా మారనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నిజాంసుగర్స్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ ఎంపీ కవితపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు కనీసం పెండింగ్ వేతనాలు కూడా రాకపోవడంతో ఫ్యాక్టరీ వ్యవహారం గులాబీ నేతలకు సంకటంగా మారిందని చెప్పవచ్చు. గత సమైఖ్య సర్కారు హాయంలో బోధన్ నిజాంసుగర్స్‌తో పాటు మెదక్, మెట్‌పల్లి కర్మాగారాలు ప్రైవేటుపరమైన సంగతి తెలిసిందె. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కర్మాగారాలు కొన్నాళ్ల పాటు చక్కగా నడిచినా గత రెండున్నరేళ్ల క్రితం యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి కర్మాగారాలను మూసివేసింది.
లేఆఫ్ నిర్ణయం వలన కార్మికులకు వేతనాలు కూడా కరువయ్యాయి. ఈ లేఆఫ్‌ను ఎత్తివేయాలని కార్మికులు ఎన్ని ఉద్యమాలు చేసినా యాజమాన్యం మాత్రం కనికరించలేక పోయింది. చివరికి పెండింగ్‌లో ఉన్న వేతనాలైనా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కలిసిన నాయకుడికల్లా విన్నవించారు. చివరికి పలు మార్లు ఎంపీ కవితను కలిసి వేతనాలు వచ్చేలా చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరారు. దాంతో ఎంపీ కవిత కార్మికులకు పూర్తి భరోసానిచ్చారు. అంతేకాకుండా గత ఉద్యమ సమయంలో ఇక్కడ విస్తృతంగా పర్యటించిన ఎంపీ కవిత తెలంగాణ వస్తే నిజాంసుగర్స్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఇప్పించేందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వంతు ప్రయత్నాలు చేశారు. గతేడాది మార్చి వరకు 14 కోట్ల 22 లక్షల రూపాయల వేతనాలను కార్మికుల ఖాతాలో వేసే విధంగా ప్రయత్నాలు చేసినా ఈ వేతనాలు ఇప్పటి వరకు కూడా కార్మికులకు చేరలేక పోయాయి. ఇదే తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఎంపీ కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తుండటంతో ప్రతిపక్షాలు నిజాంసుగర్స్‌ను ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి. బోధన్ పట్టణంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫ్యాక్టరీ గురించి అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరి మీద మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాంసుగర్స్ కార్మికులకు ఎంపీ కవిత అన్యాయం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం వేతనాలు కూడా ఇప్పించలేక పోయారని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను అధికార పార్టీ నాయకులు ఖండిస్తున్నా కార్మికులకు వేతనాలు అందక పోవడంతో ప్రతిపక్షాలకు ఈ అంశం మంచి అవకాశంగా పరిణమించింది. ఒకింత కార్మికులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ లేఆఫ్ సంగతి దేవుడెరుగు కానీ కనీసం తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలైనా తమకు వస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతామని పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు నిజాంసుగర్స్ కర్మాగారం వ్యవహారాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్నా బోధన్ అర్బన్‌లో నెలకొని ఉన్న పరిస్థితుల వలన దీని ప్రభావం తెరాసపై ఏ మాత్రం పడలేకపోయింది. కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ నిజాంసుగర్స్ కర్మాగారంలో లే ఆఫ్ ఎత్తివేసి ఫ్యాక్టరీలను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అరవింద్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందె. కావున ఆయన ఈ సారి ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుని తెరాసను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం బోధన్‌లో ఆ పార్టీ నాయకులు శక్కర్‌నగర్‌లో పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు.
ప్రస్తుతం జరుగనున్న ప్రచార కార్యక్రమంలో కూడా కూడా నిజాంసుగర్స్ వ్యవహారానే్న ప్రధాన అంశంగా మలుచుకుని పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.

చిత్రం..బోధన్ నిజాం చక్కెర కర్మాగారం