తెలంగాణ

గీతం విద్యార్థులకు ప్రాంగణ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: విద్యాసంవత్సరం ముగింపునకు చేరుకోవడంతో ప్రాంగణ ఆఫర్ల సంరంభం ఊపందుకుంది. గీతం యూనివర్శిటీ, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం బిజినెస్ స్కూల్‌కు చెందిన విద్యార్థులకు కంపెనీలు భారీ ఆఫర్లు ఇచ్చాయి. 120 దేశీయ, బహుళ జాతి కంపెనీలు నియామకాలు చేపట్టాయి. ఆమేజాన్ సంస్థ గీతం విద్యార్థులను 16.05 లక్షల గరిష్ట వార్షిక వేతనాలతో విద్యార్థులను ఎంపిక చేయగా, ఎజిలిటిక్స్ 8 లక్షలకు, టీవీఎస్ మోటార్స్ 7.9 లక్షలకు, డీబీఎస్ 7.02 లక్షలకు, క్యాపిటల్ ఫస్టు 7 లక్షలకు, రురేనాక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ 6.99 లక్షలకు ఆఫర్లు ఇచ్చాయి. ఒపెన్ టెక్ట్, మహేంద్ర ఫైనాన్స్ సంస్థ్ధలు 6.8 లక్షలకు, ఆప్టమ్,హోస్ట్ ఎనలిటిక్స్ , నెస్లే కంపెనీలు 6.5 లక్షలు, కే టెక్నాలజీస్, ఓఎస్‌టీసీ, అంబుజా సిమ్మెంట్స్, డెల్లాయిట్‌లు ఆరు లక్షలు ప్యాకేజీలను ఆఫర్ చేశాయి. టాటా కన్సల్టెన్సీ 105 మందిని ఎంపిక చేయగా, విప్రో 41 మందిని, జెన్‌ప్యాక్ట్ 36 మందిని ఎంపిక చేసిందని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ నిర్వహించిన విజేతల దినోత్సవ కార్యక్రమంలో నియమకాల పత్రాలను విద్యార్థులకు అందజేశారు. గీతం వీసీ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ మాట్లాడుతూ ముందుగా మనపై నమ్మకం ఉంటే విశ్వాసం ఇనుమడిస్తుందని , చేయబోయే పనిపై స్పష్టత ఉంటే ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చని చెప్పారు. ప్రో వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ మారిపోతోందని, దానిని నిరంతరం అందిపుచ్చుకోవాలని సూచించారు. గీతం డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, ప్రొఫెసర్ సీహెచ్ సంజయ్, , ప్రొఫెసర్ వై లక్ష్మణ్ కుమార్, ప్రొఫెసర్ కే అక్కలక్ష్మీ పాల్గొన్నారు.