తెలంగాణ

మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్ష ప్రక్రియ శుక్రవారం నాడు ముగియనుంది. రెండు విడతలుగా జరిగిన మెయిన్ పరీక్షలో మంచి స్కోర్ సాధించిన వారిలో 2.45 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు. మే 27న అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం మే 3వ తేదీ నుండి మే 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు మే 10 వరకూ గడువు ఉంటుంది. అడ్మిట్ కార్డులను మే 20 నుండి జారీ చేస్తారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను మే 29 నుండి జూన్ 1వ తేదీ వరకూ జారీ చేస్తారు. ఆన్సర్‌కీని జూన్ 4న ప్రకటించి, అభ్యర్ధుల నుండి అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది ఫలితాలను ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి జూన్ 14న ప్రకటిస్తారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు జూన్ 14 నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభించి, ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును జూన్ 17న ముగిస్తారు. వాటి ఫలితాలను జూన్ 21న ప్రకటిస్తారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా బీటెక్, బీఎస్, బీ ఆర్కిటెక్చర్, బీటెక్- ఎంటెక్, బీఎస్- ఎంఎస్, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడతారు. జెఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లోనూ, అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ద్వారా ఐఐటీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. అడ్వాన్స్‌డ్ టెస్టుకు తెలంగాణలో హైదరాబాద్,కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మెయిన్ తొలి విడత నిర్వహించినపుడు జనవరిలో 9.29 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించినపుడు 9.35 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.