తెలంగాణ

ఈవీఎంలతో జనం అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ పనితీరుపై ఓటర్లు తీర్పు చెప్పారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏపీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే మీడియాతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎంగా చెప్పుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బహుషా ఈవీఎంలు తనను గెలిపిస్తాయని ముందస్తు సమాచారం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ తానే సీఎంనని ప్రచారం చేసుకోవడం ఏమిటని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నిలబెట్టడానికే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు ఆయన చెప్పుకున్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు కీలకపాత్ర నిర్వహిస్తారని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తన ప్రభావాన్ని కోల్పోలేదని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు గంటల తరబడి పని చేయకపోవడంతో ఓటర్లు నిరుత్సాహ పడ్డారన్నారు. పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ప్రపంచంలో అనేక దేశాలు బ్యాలెట్ విధానానికే ప్రాధాన్యతను ఇచ్చాయని రావుల అన్నారు. ఈసీకి ఈవీఎంలపై మోజు ఎందుకో ఓటర్లకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ సజావుగా జరిగిందన్నారు. ఈవీఎంలు అయితే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఈవీఎంలు పని చేయకపోవడంతో డే అండ్ నైట్ వ్యాచ్‌లాగా ఓటర్లు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. నిజామాబాద్‌లో ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా రైతులు ససేమిరా అనడంతో ప్రభుత్వానికి దిక్కుతోచలేదన్నారు. బీజేపీ నేతలు అడ్డుగోలుగా నగదును తరలిస్తూ పట్టుబడినా వదిలేశారని ఆరోపించారు.