తెలంగాణ

ఇంటర్ ఫలితాలపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు నేడే అంటూ సామాజిక మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టడంతో అటు విద్యార్థుల్లోనూ, మరో పక్క తల్లిదండ్రుల్లోనూ ఆసక్తి పెరగడంతో వాస్తవ సమాచారం కోసం పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం వౌనం వహించడం విడ్డూరం. కనీసం ఫలానా తేదీన ఫలితాలు ఇస్తామని గట్టిగా చెప్పలేకపోవడంతో ఫలితాలపై గందరగోళం చెలరేగింది. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు తమ ఫలితాలను ప్రకటించడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ మరింత ఎక్కువైంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను 12వ తేదీనే ప్రకటించనున్నారనే వార్తలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అందులో వాస్తవం ఎంతో అర్ధం కాక అయోమయానికి గురయ్యారు. విద్యాసంవత్సరం ఆరంభం నుండి ఏదో ఒకరకమైన సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఇంటర్మీడియట్ బోర్డు ఎప్పటికపుడు జరుగుతున్న విషయాలపై విద్యార్థులకు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఏదో జరుగుతోందనే గందరగోళం ప్రతిసారీ ఏర్పడుతోంది. ఆన్‌లైన్ పేరిట బోర్డు చేస్తున్న సరికొత్త ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చేలోపే ఈ గందరగోళానికి బోర్డు అధికారులు కారణమవుతున్నారు.
జూనియర్ కాలేజీల ఆన్ లైన్ అనుబంధ గుర్తింపు మొదలు, కొత్త విద్యార్ధుల రిజిస్ట్రేషన్, ఎగ్జామినేషన్ అప్లికేషన్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లోనూ ఈ ఏడాది గందరగోళం చెలరేగింది. దాంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పనిచేసే సిబ్బంది నానా అగచాట్లకు గురై బావురుమనడంతో చివరికి బోర్డు అధికారులు చేయిదాటకముందే సరిదిద్దుకున్నారు. పరీక్ష ఫీజుల చెల్లింపు చివరి తేదీని పొడిగించి మొత్తం మీద ఆ ప్రక్రియను మమ అనిపించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాల విషయంలో బోర్డు నేటికీ ఒక తేదీని ప్రకటించకపోవడంతో అనేక తేదీలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంటర్ ఫలితాలు 8వ తేదీన విడుదల కాబోతున్నట్టు వార్త వచ్చింది. లాంగ్వేజి పేపర్లు మరీ ముఖ్యంగా ఇంగ్లీషు పేపర్ల వాల్యూయేషన్ జాప్యం జరగడం , సరిపడా వాల్యూయేషన్ సిబ్బంది లేక పేపర్లను స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల నుండి మార్చాల్సి రావడంతో బోర్డు సిబ్బందిలోనే కొంత గందరగోళం ఏర్పడినట్టు సమాచారం. స్పాట్ నిబంధనలను ఉల్లంఘించి ఒక్కో లెక్చరర్‌తో అదనపు పేపర్లను దిద్దించినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఫలితాల విడుదలలో జాప్యం జరిగిందని చెబుతున్నారు. గతవారం బోర్డు సమాచార అధికారి ఒక ప్రకటన విడుదల చేస్తూ, సామాజిక మాద్యమాల్లో ఫలితాలకు సంబంధించిన వార్త అవాస్తవమని పేర్కొన్నారు. సకాలంలోనే పేపర్ వాల్యూయేషన్ జరుగుతోందని, టాబ్యులేషన్ పూర్తయ్యాక ఫలితాలను వెల్లడిస్తామని బోర్డు అధికారి వివరించారు. విద్యార్థుల్లో నెలకొన్న ఆతృత బోర్డు అధికారులకు అర్ధం కాకపోవడం దురదృష్టకరమని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కాగా ఇంటర్ ఫలితాలు 18వ తేదీ కంటే ముందు వెలువడే అవకాశం లేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.