తెలంగాణ

సర్కారుపై రిజర్వేషన్ల అస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వంపై రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. జిల్లా, నియోజకవర్గ నేతలలో పోరాట స్ఫూర్తి కొనసాగించేందుకు హైదరాబాద్, వరంగల్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది. ఎన్నికల సమయంలో మైనారిటీ, గిరిజనులకు తెరాస ఇచ్చిన రిజర్వేషన్ల హామీ, మేనిఫెస్టో అంశాలను క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయి ప్రచారం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలంగాణ టిడిపి నేతలను ఆదేశించారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన టిటిడిపి ముఖ్యుల సమావేశంలో పాల్గొన్న లోకేష్.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పునరుజ్జీవం కోసం అందరూ కష్టపడాల్సిందేనని, ముఖ్యంగా నాయకులంతా గ్రామాలకు వెళ్లి, తెరాస ప్రభుత్వం అవలంబిస్తోన్న అప్రజాస్వామ్య విధానాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. నేతలు నిరంతరం జనంలో ఉంటేనే ఆదరణ లభిస్తుందన్నారు.
అందులో భాగంగా ముందు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలని, నియోజకవర్గ ఇన్చార్జులు ఎక్కడ ఖాళీ ఉంటే, అక్కడ వాటిని తక్షణమే భర్తీ చేయాలని, అదే సమయంలో జిల్లా ఇన్చార్జిల నియామకాలను కూడా వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం ఆది లేదా సోమవారం నాటికి జిల్లా ఇన్చార్జిల నియామకం పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెరాస హామీ ఇచ్చినందున, వాటి అమలు కోసం టిటిడిపి పోరాటం చేయాలని లోకేష్ ఆదేశించారు. రెండేళ్లయినా ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రజాసమక్షంలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వాటిపై అధ్యయనం చేసి, మైనారిటీ, గిరిజన సంఘాలను సమన్వయం చేసుకుని హామీ అమలయ్యే వరకూ పోరాటం చేయాలని సూచించారు. ఈ రెండు అంశాలపై పోరాటం చేస్తే ఆ రెండు వర్గాలు పార్టీ దరి చేరతాయన్నారు. సీనియర్లంతా ఈ రెండు అంశాలపై సమన్వయంతో వ్యవహరించి, కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా మల్లన్నసాగర్ వ్యవహారంపై ప్రభుత్వం మొండిగా పోతున్నందున, అక్కడి నిర్వాసితులకు పార్టీపరంగా దన్నుగా నిలవాలని పార్టీ నేతలను కోరారు. దీనిపై ఒక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రాజెక్టులతో రోడ్డునపడుతున్న నిర్వాసితుల పక్షాన పార్టీ నిలవాలని, తెలంగాణలో ఏ వర్గం నష్టపోతే ఆ వర్గానికి భరోసా ఇవ్వడం ద్వారా, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. హైదరాబాద్‌లో పార్టీపరంగా ఇఫ్తార్ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి, అరవిందకుమార్‌గౌడ్, నామా నాగేశ్వరరావు, విజయరమణారావు, అమర్‌నాధ్‌బాబు, అరికెల నర్సారెడ్డి, నర్శిరెడ్డి, శోభారాణి, బుచ్చిలింగం హాజరయ్యారు.